TGCET 2025 Updates : తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాలు - అప్లికేషన్ల గడువు పొడిగింపు, ఈనెల 23న రాత పరీక్ష
TG Gurukul Common Entrance Test 2025 : తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం అప్లికేషన్ల స్వీకణ కొనసాగుతోంది. అయితే ఈ గడువును ఫిబ్రవరి 6వ తేదీ వరకు పొడిగించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించనున్నారు.
తెలంగాణ గురుకులాల్లో (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS) 5వ తరగతిలో అడ్మిషన్లకు ప్రాసెస్ కొనసాగుతోంది. 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఉమ్మడి పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అయితే ఫిబ్రవరి 1వ తేదీతోనే ఈ గడువు ముగియగా.. అధికారులు తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ గడువును ఫిబ్రవరి 6వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించారు. ఈలోపే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఫిబ్రవరి 23న పరీక్ష….
అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బాల బాలికలు ఫిబ్రవరి 6వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు కోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 01.00 గంట ఎగ్జామ్ ఉంటుంది.
అభ్యర్థులకు సూచనలు:
- అభ్యర్థులు వారి అర్హతలను పరిశీలించుకుని ఫిబ్రవరి 6వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి.
- ఆన్ లైన్ లో రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
- ఒక ఫోన్ నెంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చు. మరో దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉండదు.
- అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే అలాంటి వారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపడతారు.
- విద్యార్థుల ఎంపికకు "ఉమ్మడి జిల్లా" ఒక యూనిట్ గా పరిగణిస్తారు.
- అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
- అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే వారు 040-23120431, 040-23120432 నెంబర్లను సంప్రదించవచ్చు.
- ఈ అధికారిక లింక్ పై క్లిక్ చేసి ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం