TGPSC Group 2 Hall Ticket 2024 : రేపు గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల - 15, 16 తేదీల్లో పరీక్షలు, ఇదిగో లింక్
TGPSC Group 2 Exam Hall Tickets : తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్15, 16 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు( డిసెంబర్ 9) విడుదల కానున్నాయి. టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఉద్యోగాల భర్తీపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే గ్రూప్ 1తో పాటు గ్రూప్ 3 పరీక్షలను కూడా పూర్తి చేసింది. ఇక గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు కూడా ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనుంది. రాష్ట్ర వ్యప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేసింది.
రేపు హాల్ టికెట్లు విడుదల :
గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను రేపట్నుంచి అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ ఓ ప్రకటనలో సూచించింది. హాల్‌టికెట్లు డౌన్లోడ్ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదించాలని తెలిపింది. లేదా Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్ సందేహాలు పంపవచ్చని పేర్కొంది.
ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే Download Hall Ticket For Group-II Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో టీజీపీఎస్సీ ఐడీ , పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేయాలి.
- డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్…
గ్రూప్-2 ఎగ్జామ్ లో భాగంగా…. మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.ఇక డిసెంబరు 16వ తేదీన పేపర్3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.
మరోవైపు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. నవంబర్ నెలలోనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా ప్రారంభించింది. మూల్యాంకనం పూర్తి కాగానే… మెరిట్ జాబితాను సిద్ధం చేయనుంది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది. అయితే గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత మిగతా పరీక్షల తుది ఫలితాలను ఇవ్వాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాతనే గ్రూప్ 3, గ్రూప్ 2 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్ 1 ఫలితాలు కాకుండా గ్రూప్ 3, 2 ఫలితాలను ప్రకటిస్తే కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంటుందని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇటీవలే గురుకుల నియామాకాల్లో కూడా ఇదే జరిగింది. ఇక గ్రూప్ 3 పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రాథమిక కీలను ప్రకటించనున్నారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
సంబంధిత కథనం