రాష్ట్రంలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్తవాటివి మాత్రమే కాకుండా… రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఈ గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు… మే 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
నిజానికి ఈ గడువు గతేడాది డిసెంబర్ లో పూర్తయింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు…పలుమార్లు పొడిగించారు. ఈ క్రమంలోనే… అన్ని కోర్సుల విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దని…మే 31 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు స్కాలర్ షిప్స్ కోసం అప్లయ్ చేసుకోగా… రెన్యూవల్ చేసుకునే వాళ్లు కూడా ప్రాసెస్ పూర్తి చేశారు. ఇంకా మిగిలిపోయిన వారుంటే వెంటనే… ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం ఈ గడువును పొడిగించారు. కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావటంతో.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో… అధికారులు మే 31 వరకు అవకాశం కల్పించారు. ఈ గడువు పూర్తయితే… మరోసారి పొడిగించే అవకాశం దాదాపుగా లేదు.
తెలంగాణ ఈ-పాస్ వెబ్ సైట్( https://telanganaepass.cgg.gov.in/ ) లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకునే వీలు ఉంటుంది. దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలసుకోవచ్చు. ఇక రెన్యూవల్ విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అయితే వారు Renewal Registration అనే ఆప్షన్పై నొక్కి….రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. రెన్యూవల్ విద్యార్థులు స్కాలర్ షిప్ స్టేటస్ చెక్ చేసుకునే వీలుంటుంది.
సంబంధిత కథనం