TG EdCET Schedule 2025 : తెలంగాణ ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే
TG EdCET Schedule 2025 Updates: తెలంగాణ ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 10వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూన్ 1న ఎగ్జామ్ ఉంటుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది.
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది. 2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మార్చి 10వ తేదీన జారీ అవుతుంది. జూన్ 1వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది.
మార్చి 12 నుంచి దరఖాస్తులు...
మార్చి 12వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 13వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. జూన్ 1వ తేదీన పరీక్ష ఉంటుంది. ఉదయం సెషన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించి కాకతీయ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.
ముఖ్య తేదీలు:
- ప్రవేశ పరీక్ష ప్రకటన - టీజీ ఎడ్ సెట్
- ఎడ్ సెట్ నోటిఫికేషన్ - 10 మార్చి 2025
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభ తేదీ - 23 మార్చి 2025
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 13 మే 2025
- పరీక్ష తేదీలు - 1 జూన్, 2025.
టీజీ పీఈసెట్ షెడ్యూల్ కూడా జారీ అయింది. మార్చి 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని ఉన్నత విద్యామండలి పేర్కొంది. మార్చి 15వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 24 వరకు అప్లికేషన్ల గడువు ముగుస్తుంది. జూన్ 11 నుంచి 14 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.
సంబంధిత కథనం