తెలంగాణ ఎడ్‌సెట్‌ - 2025 ఫలితాలు విడుదల... ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి-telangana edcet 2025 results announced by kakatiya university here direct link to get rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ ఎడ్‌సెట్‌ - 2025 ఫలితాలు విడుదల... ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

తెలంగాణ ఎడ్‌సెట్‌ - 2025 ఫలితాలు విడుదల... ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

తెలంగాణ ఎడ్ సెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు https://edcet.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అర్హత పొందిన వారికి బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు.

టీజీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ - 2025 ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను కాకతీయ యూనివర్శిటీ చేపట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.

తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షలు జూన్‌ 1వ తేదీన జరిగాయి. మొదటి షెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించారు.

ఈసారి జరిగిన ఎడ్ సెట్‌కు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 96.38 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాల్లో గణపతి శాస్త్రి 126 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 121 మార్కులతో శరత్ చంద్ర రెండో ప్లేస్ లో నిలిచారు.

టీజీ ఎడ్ సెట్ ర్యాంకు కార్డు - డౌన్లోడ్ ప్రాసెస్

  1. అభ్యర్థులు ముందుగా టీజీ ఎడ్ సెట్ https://edcet.tgche.ac.in/ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో డౌన్ లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి
  3. అభ్యర్థి ఎడ్ సెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
  4. వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
  5. స్క్రీన్ పై విద్యార్థి ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది.
  6. ర్యాంకు కార్డును డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
  7. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఎడ్ సెట్ - 2025 ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.