చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రకటన జారీ చేసింది. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఈ పోస్టును భర్తీ చేయనుంది. మహబూబ్ నగర్ డీసీసీబీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.
ఈ పోస్టుకు ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 62 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టుకు సీఏఐఐబీ, డీబీఎఫ్ డిప్లొమా(కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్‌మెంట్), చార్టెడ్ అకౌంట్, పీజీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులవుతారు. కనీసం 8 ఏళ్లపాటు బ్యాంకింగ్ సెక్టార్ లో పని చేసిన అనుభవం ఉండాలి.
తెలుగు భాషలో నైపుణ్యం ఉండాలి. ఎంపికైన వారు మూడేళ్లపాటు పని చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించరు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 28వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారి నెలకు రూ.97,620 జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు tgcab.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో మీ వివరాలను పూర్తి చేయాలి. మీ విద్యార్హత పత్రాలతో పాటు పుట్టిన తేదీ వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను జత చేయాలి. అంతేకాకుండా రూ. 1000 డీడీ చెల్లించాలి. టీజీసీఏబీ, హైదరాబాద్ పేరుపై ఈ డీడీని తీయాలి.
పూర్తి చేసిన దరఖాస్తును “మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్. హెడ్ ఆఫీస్, 4-1-441, ట్రూప్ బజార్, హైదరాబాద్-500001” చిరునామాలో సమర్పించాలి. ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. అసంపూర్ణంగా దరఖాస్తును సమర్పిస్తే తిరస్కరించనున్నట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.