టీచర్ జాబ్ సాధించేందుకు.. ఏపీ డీఎస్సీకి తెలంగాణ అభ్యర్థులు కూడా పోటీపడుతున్నారు. కూటమి ప్రభుత్వం 16 వేల 347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 3.35 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 7 వేల 159 మంది ఉన్నారు. ఇందులో తెలంగాణ అభ్యర్థులే దాదాపు 7 వేల వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ మెగా డీఎస్సీకి సంబంధించి నాన్ లోకల్ కోటా కింద 20 శాతం పోస్టులను కేటాయించారు. వాటికి ఏపీతోపాటు.. ఏ రాష్ట్రం వారైనా పోటీపడవచ్చు. అయితే.. టెన్త్‌లో సెకెండ్ లాంగ్వేజ్ తెలుగు తప్పనిసరిగా ఉండాలి. నాన్ లోకల్ కోటా పోస్టుల కోసం.. ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, నారాయణపేట నుంచి ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు.
సరిహద్దు జిల్లాలే కాకుండా.. రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట, నిర్మల్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో డీఎస్సీలో కొన్ని మార్కుల తేడాతో జాబ్ రానివారు.. ఏపీ డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ డీఎస్సీ పరీక్షలను జూన్ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మెగా డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందించడం ద్వారా.. వారి విజయావకాశాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శిక్షణలో భాగంగా.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సబ్జెక్టు నిపుణులతో తరగతులు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్, మాక్ టెస్టులు, ఇతర అవసరమైన వనరులను ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 20, 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 20
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 15
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: మే 30 నుంచి
పరీక్ష తేదీలు: జూన్ 6 నుండి జూలై 6 వరకు
సంబంధిత కథనం