BC Welfare Schools Admissions : తెలంగాణలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ బాలురు, బాలికల గురుకుల విద్యాలయాల్లో (ఇంగ్లీష్ మీడియం) 6,7,8, 9 తరగతులలో బ్యాక్ లాగ్ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. మార్చి 31వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అలాగే https://mjptbcadmissions.org/ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సీట్లకు ఏప్రిల్ 20, 2025న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
2025-26 విద్యాసంవత్సరానికి 6,7,8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. మార్చి 6వ తేదీ నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా, మార్చి 31 చివరి తేదీగా ప్రకటించారు. హాల్‌టికెట్లను ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రవేశ పరీక్షలో మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.
6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 31-08-2025 నాటికి 12 సంవత్సరాలు మించకూడదు. 10 ఏళ్లకు తగ్గకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదని తెలిపారు. దరఖాస్తు ఫీజు రూ.150 ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాల కోసం http://mjptbcwreis.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.
సంబంధిత కథనం