తెలంగాణ బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంట్రెన్స్ లేకుండానే సీట్ల భర్తీ..!-telangana bc gurukul degree colleges admissions updates application deadline extended up to may 20 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంట్రెన్స్ లేకుండానే సీట్ల భర్తీ..!

తెలంగాణ బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఎంట్రెన్స్ లేకుండానే సీట్ల భర్తీ..!

తెలంగాణలోని బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.అయితే ఈ గడువును మే 20వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్‌ కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉంటాయి.mjpabcwreis.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.

తెలంగాణ బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లు

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ముగియటంతో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులు మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. 2025 -26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి.

అర్హులైన విద్యార్థులు tgrdccet.cgg.gov.in/TGRDCWEB వెబ్ సైట్ ద్వారా లేదా https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB/ వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అర్హులవుతారు. రెగ్యులర్‌ కోర్సులతోపాటు ఫైన్‌ ఆర్ట్స్‌, యానిమేషన్‌ తదితర వృత్తి విద్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాల కోసం ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ ద్వారా mjptbcwreis.telangana.gov.in లేదా tgrdccet. cgg. gov.in/TGRDCWEB లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారు రూ. 200 ఫీజు చెల్లించాలి. వివరాలకు ఫోన్‌ నంబర్‌ 040-23328266లో సంప్రదించాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్ మెరిట్ మార్కులను ప్రమాణికంగా తీసుకుంటారు. మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అధికారిక వెబ్ సైట్లో ఎంపికైన వారి జాబితాలను ప్రకటిస్తారు.

ఇంటర్ అడ్మిషన్లు - ఇవాళే చివరి తేదీ:

తెలంగాణలోని మహాత్మ పూలే బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల కొనసాగుతుండగా… ఈ గడువు మే 17వ తేదీతో పూర్తికానుంది.అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష లేకుండా సీట్లను భర్తీ చేస్తారు.

కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మెరిట్ తో పాటు రిజర్వేషన్లను ప్రమాణికంగా తీసుకుంటారు. వీటి ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ ఈసీతో పాటు వొకేషనల్ కోర్సుల్లో కూడా సీట్ల భర్తీని చేపడుతారు.

ఇందులో సీట్లు పొందే విద్యార్థులకు నీట్, ఎంసెట్, ఐఐటీ, సీఏ, సీపీటీ లేదా క్లాట్ కోచింగ్ కూడా ఇస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు హాస్టల్ సదుపాయం ఉంటుంది. ఆధునాతమైన ల్యాబ్స్ తో పాటు సరైన వసతులు కల్పిస్తారు. అర్హులైన విద్యార్థులు https://mjpabcwreis.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.