TG SSC Exams 2025 : పదో తరగతి విద్యార్థులకు అప్డేట్ - ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖరారు-telangana 10th class prefinal exams to start from 6th march 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Ssc Exams 2025 : పదో తరగతి విద్యార్థులకు అప్డేట్ - ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖరారు

TG SSC Exams 2025 : పదో తరగతి విద్యార్థులకు అప్డేట్ - ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖరారు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 23, 2025 07:27 PM IST

TG 10th class Prefinal Exams: ప‌దో త‌ర‌గ‌తి ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 6వ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమై… 15వ తేదీతో ముగుస్తాయని ప్రకటించింది. ఇక పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీతో ప్రారంభమవుతాయి.

పదో తరగతి పరీక్షలు (ఫైల్ ఫొటో)
పదో తరగతి పరీక్షలు (ఫైల్ ఫొటో) (image source @DDNewsAndhra)

తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రీ ఫైనల్ పరీక్షలపై ప్రకటన విడుదల చేసింది. మార్చి 6వ తేదీ నుంచి ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌లు ప్రారంభమవుతాయని ప్రకటించింది.

yearly horoscope entry point

ఈ ప్రీ ఫైనల్ పరీక్షలన్నీ మార్చి 15వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయని విద్యాశాఖ పేర్కొంది. ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది.

మార్చి 6వ తేదీన ఫ‌స్ట్ లాంగ్వేజ్, 7వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. మార్చి 10న థ‌ర్డ్ లాంగ్వేజ్, మార్చి 11న గణితం, మార్చి 12న ఫిజిక‌ల్ సైన్స్(భౌతిక శాస్త్రం), మార్చి 13వ తేదీన బ‌యోలాజికల్ సైన్స్(జీవశాస్త్రం), మార్చి 15న సోష‌ల్ స్టడీస్ ఎగ్జామ్స్ జరుగుతాయి.

మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు

ఇక ఇప్పటికే విద్యాశాఖ టెన్త్ వార్షిక షెడ్యూల్‌ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫిజిక్స్‌, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.

పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ 2025 :

  1. 21-03-2025 ఫస్ట్‌ లాంగ్వేజ్
  2. 22-03-2025 సెకండ్‌ లాంగ్వేజ్
  3. 24-03-2025 థర్డ్‌ లాంగ్వేజ్
  4. 26-03-2025 మ్యాథమేటిక్స్‌
  5. 28-03-2025 ఫిజికల్‌ సైన్స్‌
  6. 29-03-2025 బయోలాజికల్‌ సైన్స్‌
  7. 02-04-2025 సోషల్‌ స్టడీస్‌.

టెన్త్ విద్యార్థులకు రెగ్యులర్‌ తరగతులతో పాటు నవంబరు నుంచి ఉదయం పూట ఒక గంటపాటు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షల దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట పాటు ప్రత్యేక తరగతులకు ప్రణాళిక రూపొందించారు. వారం చివరన స్లిప్‌ టెస్టులు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా.. సబ్జెక్టు ఉపాధ్యాయులను సెప్టెంబరు నెలలోనే సర్దుబాటు చేశారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించారు. ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా కార్యాచరణ రూపొందించామని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అటు ఫలితాలపై పూర్తిగా ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలని ఇటీవల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫలితాల మెరుగుదలకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో తరచూ సమావేశాలు నిర్వహించి జిల్లా అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం