ఏ క్షణంలోనైనా తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు…! ఎలా చెక్ చేసుకోవాలంటే…?-telanagna inter advance supplementary result 2025 updates know these key links and steps ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏ క్షణంలోనైనా తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు…! ఎలా చెక్ చేసుకోవాలంటే…?

ఏ క్షణంలోనైనా తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు…! ఎలా చెక్ చేసుకోవాలంటే…?

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకనం పూర్తికాగా.. ఏ క్షణమైనా ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. విడుదలైన వెంటనే tgbie.cgg.gov.in లింక్ తో రిజల్ట్స్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 (image unsplash.com)

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఇందుకోసం పరీక్ష రాసిన విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 4.2 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తి అయింది. పరీక్ష రాసిన విద్యార్థులంతా కూడా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది.

ఏప్రిల్ లో తెలంగాణ ఇంటర్ రెగ్యూలర్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫెయిల్ అయిన వారితో పాటు మార్కుల పెంపు కోసం విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఈ పరీక్షలను మే 22 నుంచి మే 30వ తేదీతో పూర్తయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర వరకు రెండు షిప్టుల్లో చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి షిప్టులో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ పరీక్షలు జరిగాయి.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే…?

  1. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
  2. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మీ హాల్‌టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల అప్డేట్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.