Free financial courses : టీసీఎస్​ నుంచి 3 ఫైనాన్షియల్​ కోర్సులు- ఫ్రీగా ఆర్థిక పాఠాలు, సర్టిఫికేట్​ కూడా-tcs offers 3 free financial courses for all heres all you need to know ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Free Financial Courses : టీసీఎస్​ నుంచి 3 ఫైనాన్షియల్​ కోర్సులు- ఫ్రీగా ఆర్థిక పాఠాలు, సర్టిఫికేట్​ కూడా

Free financial courses : టీసీఎస్​ నుంచి 3 ఫైనాన్షియల్​ కోర్సులు- ఫ్రీగా ఆర్థిక పాఠాలు, సర్టిఫికేట్​ కూడా

Sharath Chitturi HT Telugu
Jan 11, 2025 08:10 AM IST

TCS Free financial courses : ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని చూస్తున్న వారికి, ఫైనాన్స్​ సెక్టార్​లో కెరీర్​ కోసం ప్రయత్నిస్తున్న వారికి గుడ్​ న్యూస్​! టీసీఎస్​ ఉచితంగా 3 ఫైనాన్షియల్​ కోర్సులను ఇస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఈ టీసీఎస్​ ఫ్రీ ఫైనాన్షియల్​ కోర్సులతో మీరు లబ్ధిపొందండి..
ఈ టీసీఎస్​ ఫ్రీ ఫైనాన్షియల్​ కోర్సులతో మీరు లబ్ధిపొందండి..

నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఫైనాన్షియల్​ లిటరసీ చాలా ముఖ్యం. అర్థిక విషయాలపై పట్టు ఉంటేనే జీవితంలో ఫైనాన్షియల్​గా స్థిరపడగలము. లేకపోతే ఎంత సంపాదించినా ప్రయోజనం ఉండదు. ఫైనాన్షియల్​ లిటరసీ ఉంటే బడ్జెట్ ఖర్చులు, డబ్బు ఆదా చేసే అలవాటు, రుణ నిర్వహణ కోసం వ్యూహాలను రూపొందించడం వంటి కీలక విషయాలపై పట్టు ఉంటుంది. కానీ చాలా మందికి.. ఎక్కడ? ఎలా? మొదలుపెట్టాలో తెలియదు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! మీ ఫైనాన్షియల్​ లిటరసీని పెంచుకునేందుకు టీసీఎస్​ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​) ఉచితంగా 3 కోర్సులను అందిస్తోంది. అవి..

yearly horoscope entry point
  • వెల్త్ మేనేజ్​మెంట్ ప్రాథమికాంశాలు
  • ఫైనాన్షియల్ సెక్టార్​లో మార్కెట్ రిస్క్​ను అర్థం చేసుకోవడం
  • ఫైనాన్షియల్ సెక్టార్​లో రిస్క్ మేనేజ్​మెంట్​ను అర్థం చేసుకోవడం

వెల్త్ మేనేజ్​మెంట్ బేసిక్స్:

టీసీఎస్ అందిస్తున్న ఈ ఉచిత కోర్సులో వెల్త్ మేనేజ్​మెంట్​లో బేసిక్స్ గురించి మరింత తెలుసుకోవచ్చు.

వెల్త్ మేనేజ్​మెంట్ అనేది ప్రధానంగా డబ్బు నిర్మాణం, ప్రణాళికను కలిగి ఉంటుంది. పోర్ట్​ఫోలియో మేనేజ్​మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి వివిధ ఫైనాన్షియల్ విభాగాలకు చెందిన అంశాలను కలపడం ద్వారా ఇన్వెస్ట్​మెంట్ ప్లానింగ్​కు ఇది సహాయపడుతుంది.

సంపద నిర్వహణ ద్వారా వినియోగదారులు వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి డబ్బు సరైన నిర్వహణ చాలా ముఖ్యం! ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్​లో కెరీర్ కోరుకునే వ్యక్తులు వెల్త్ మేనేజ్​మెంట్​పై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండటం చాలా అవసరం.

కోర్సు ఎవరు తీసుకోవచ్చు?

  • గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి
  • ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్​లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే ఉద్యోగి

కోర్సులో మీరు ఏం నేర్చుకుంటారు?

  • వెల్త్ మేనేజ్​మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్​మెంట్​లను అర్థం చేసుకోవడం
  • వెల్త్ మేనేజ్​మెంట్​లో కీలక అంశాలను అర్థం చేసుకోవడం
  • వెల్త్ మేనేజ్​మెంట్​లో ఫ్రంట్, మిడిల్, బ్యాక్ ఆఫీసుల పాత్ర

ఈ కోర్సు పూర్తైన తర్వాత పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు.

ఫైనాన్షియల్ సెక్టార్​లో మార్కెట్ రిస్క్​ను అర్థం చేసుకోవడం:

ఫైనాన్షియల్ సెక్టార్​లో మార్కెట్ రిస్క్​ను లోతుగా అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తుల కోసం టీసీఎస్ ఈ ఉచిత కోర్సును అందిస్తోంది.

అనిశ్చిత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ విపత్తులు, రాజకీయ పరిస్థితులు వంటి వివిధ కారణాల వల్ల మార్కెట్​లో రిస్క్ సంభవించవచ్చు. వీటి గురించి లోతుగా తెలుసుకుంటారు.

కోర్సు ఎవరు తీసుకోవచ్చు?

  • గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి
  • ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్​లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే ఉద్యోగి

కోర్సులో మీరు ఏం నేర్చుకుంటారు?

  • మార్కెట్ రిస్క్ టైప్స్​, ప్రభావం.
  • వీఏఆర్​, స్ట్రెస్ టెస్టింగ్, బ్యాక్ టెస్టింగ్​తో మార్కెట్ రిస్క్ మెజర్​మెంట్
  • మార్కెట్ రిస్క్ అసెస్​మెంట్​

ఈ కోర్సులో పాల్గొనేవారు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందొచ్చు.

ఫైనాన్షియల్ సెక్టార్​లో రిస్క్ మేనేజ్​మెంట్​ను అర్థం చేసుకోవడం:

ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్​మెంట్ అనేది ఆపరేషనల్, లిక్విడిటీ, మార్కెట్, క్రెడిట్ రిస్క్​కి ఉన్న ఎక్స్​పోజర్​ వల్ల కంపెనీ వాల్యూ తగ్గకుండా రక్షించడం. ఇది చాలా అవసరం ఎందుకంటే ఇది కంపెనీ ఆర్థిక నష్టాలను అంచనా వేయడం, కార్పొరేట్ లక్ష్యాలు, విధానాలకు మద్దతు ఇవ్వడానికి వ్యూహాలను అభివృద్ధి చేస్తుంది. రిస్క్ అవాయిడెన్స్, రిస్క్ మిటిగేషన్, రిస్క్ ట్రాన్స్​ఫర్​, రిస్క్ రిటెన్షన్ అనే నాలుగు బేసిక్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేెజ్​మెంట్ విధానాలు ఉంటాయి.

ఆసక్తిగల వ్యక్తులు టీసీఎస్ అందించే ఉచిత కోర్సు ద్వారా ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్​మెం కాన్సెప్ట్స్​ గురించి బాగా అర్థం చేసుకోవచ్చు.

కోర్సు ఎవరు తీసుకోవచ్చు?

  • గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి
  • ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్​లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే ఉద్యోగి

కోర్సులో మీరు ఏం నేర్చుకుంటారు?

  • ఫైనాన్షియల్ రిస్క్ ఓవర్​వ్యూ, రిస్క్​ టైప్స్​
  • రిస్క్ అనాలిసిస్ - క్వాంటిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్
  • రిస్క్ కంట్రోల్​ కోసం ఫ్రేమ్​వర్క్​లు
  • ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్​మెంట్ ప్రక్రియ
  • రిస్క్​ని హ్యాండిల్ చేసే పద్ధతులు

ఈ కోర్సును పాల్గొనేవారు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందొచ్చు.

ఇవి ఆన్​లైన్​ కోర్సులు కాబట్టి, వీటిని తీసుకున్న వారు తమకు నచ్చిన టైమ్​ల పూర్తి చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

Whats_app_banner

సంబంధిత కథనం