TMC Visakhapatnam Recruitment 2025 : విశాఖపట్నం టీఎంసీలో ఉద్యోగాలు - నెలకు రూ. లక్షకుపైగా జీతం, ముఖ్య వివరాలివే
Tata Memorial Centre Vizag Recruitment 2025 : విశాఖపట్నం టీఎంసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 7 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 10లోపు అప్లికేషన్ చేసుకోవాలి.
నకేంద్ర ఆటోమెటిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నిర్వహణలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ (హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు ఫిబ్రవరి 10లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి.
మొత్తం పోస్టులు ఎన్ని?
మొత్తం 37 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులు- 9, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్-1, మెడికల్ ఫిజిసిస్ట్-1, ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (డిస్పెన్సరీ)-1, సైంటిఫిక్ అసిస్టెంట్ (న్యూక్లియర్ మెడిసిన్)-1, సైంటిఫిక్ అసిస్టెంట్ (రేడియేషన్ ఆంకాలజీ)-1, క్లినికల్ సైకాలజిస్ట్-1, టెక్నీషియన్-1, నర్సింగ్ సూపరింటెండెంట్-1, మహిళ నర్సు -3, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, అకౌంట్స్ ఆఫీసర్-1, అసిస్టెంట్-1, లోయర్ డివిజన్ క్లర్క్-3, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ -1, అటెండెంట్-5, ట్రేడ్ హెల్పర్-5 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఒక్కో పోస్టుకు ఒక్కో రకంగా అర్హతలు ఉన్నాయి. ఆయా పోస్టులకు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ, నర్సింగ్, ఫార్మసీ, ఎంబీబీఎస్ లేదా బీడీఎస్, ఎండీ, డీఎం వంటి కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆయా ఉద్యోగాలకు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల దాటకూడదు. కొన్ని ఉద్యోగాలకు 25 ఏళ్లు మించకూడదు. మరికొన్నింటికి 27, 30, 35, 45, 50 ఏళ్ల దాటకూడదు. ఆయా జాబ్‌లను బట్టి వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్‌కు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు…
అప్లికేషన్ ఫీజు రూ.300 ఉంటుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉపయోగించి చెల్లించవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, దివ్యాంగు, ఎక్స్‌సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
జీత భత్యాలు కూడా ఒక్కొ పోస్టుకు ఒక్కో విధంగా ఉంది. అత్యధికంగా మెడికల్ ఆఫీసర్ (మెడికల్ ఆంకాలజీ) పోస్టుకు రూ.1,23,100తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. అటెండెంట్, ట్రేడ్ హెల్పర్లకు అతి తక్కువ నెలకు రూ.18,000తో పాటు ఇతర అలివెన్సులు ఉంటాయి.
దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 10 సాయంత్రం 5.30 గంటలలోపు దరఖాస్తును దాఖలు చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి పిలిచిన అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అవసరమైన ధ్రువీకరణ పత్రాలు
1. పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికేట్)
2. విద్యా అర్హత పత్రాలు
3. అనుభవానికి సంబంధించిన పత్రాలు
4. కుల ధ్రువీకరణ పత్రం
5. ఈడబ్ల్యూసీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్
6. దివ్యాంగు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి. ఏమైనా సందేహల ఉంటే నివృత్తి చేసుకునేందుకు recruitment@hbchrcv.tmc.gov.in కు మెయిల్ చేయవచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం