స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసి కాలేజీ ఫీజులు చెల్లించిన విద్యార్థి! 8.4 కి.మీ. డ్రైవింగ్‌కు రూ.23-swiggy delivery boy college fees hustle ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసి కాలేజీ ఫీజులు చెల్లించిన విద్యార్థి! 8.4 కి.మీ. డ్రైవింగ్‌కు రూ.23

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసి కాలేజీ ఫీజులు చెల్లించిన విద్యార్థి! 8.4 కి.మీ. డ్రైవింగ్‌కు రూ.23

HT Telugu Desk HT Telugu

రాత్రిపూట స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంటూ 20 ఏళ్ల విద్యార్థి చేసిన రెడ్డిట్ పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రారంభంలో పాకెట్ మనీ కోసం ఈ ఉద్యోగాన్ని చేపట్టినప్పటికీ, తరువాత కాలేజీ ఫీజుల కోసం డబ్బు సంపాదించడానికి కొనసాగించినట్టు ఆయన వెల్లడించాడు.

స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ కాలేజీ ఫీజు చెల్లించిన విద్యార్థి (ప్రతీకాత్మక చిత్రం)

రాత్రిపూట స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసి తన కాలేజీ ఫీజు చెల్లించడానికి పనిచేస్తూనే ఉన్నట్టు ఓ విద్యార్థి తెలిపిన పోస్టు వైరల్‌గా మారింది. కంప్యూటర్ సైన్స్, జర్మన్, బిఏ (ఆనర్స్) సైకాలజీ డిగ్రీలు చదువుతున్నట్టు ఆయన వివరించాడు.

“నేను ఆరంభంలో కొద్దిగా పాకెట్ మనీ సంపాదించడానికి మాత్రమే పనిచేయాలనుకున్నాను. కానీ తరువాత నా కాలేజీ ఫీజులను చెల్లించడానికి పనిచేయడం కొనసాగించాను” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

రెడ్డిట్ పోస్ట్‌లో ఆయన ఆస్క్-మీ-ఎనీథింగ్ సెషన్ నిర్వహించినప్పుడు యూజర్స్ తన అనుభవాల గురించి అడిగారు. ఆయనకు వచ్చిన టిప్స్, స్విగ్గీలో పనిచేస్తున్నప్పుడు ఆయనకు ఎదురైన ఉత్తమ, అత్యంత చెత్త అనుభవాల గురించి అడిగారు.

స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఎంత సంపాదించాడు?

స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా నెలకు రూ. 6,000 నుండి రూ. 8,000 వరకు సంపాదిస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. తన పని సమయంలో ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన తన ఆదాయాన్ని ఆయన పంచుకున్నాడు. ఫిబ్రవరి 17-23 మధ్య 4 గంటల 46 నిమిషాల పనికి రూ. 722, ఫిబ్రవరి 10-16 మధ్య 10 గంటల పనికి రూ. 1,990 సంపాదించినట్టు వివరించాడు.

ఫిబ్రవరి 3న ప్రారంభమైన వారంలో 19.5 గంటల పనికి రూ. 3,117 సంపాదించాడు. జనవరి 27 నుండి ప్రారంభమైన వారంలో ఆయన మొత్తం రూ.7,200 కంటే ఎక్కువ సంపాదించాడు. రోజుకు సుమారు రూ.100-150 పెట్రోల్‌కు ఖర్చు చేస్తున్నట్టు కూడా తెలిపాడు. వేగంగా ఆర్డర్లు పొందడంలో, మెరుగైన వేతనాలను పొందడంలో రేటింగ్స్ రైడర్లకు సహాయపడతాయని ఆయన తెలిపాడు.

28 నిమిషాల్లో 8.4 కి.మీ. దూరం డ్రైవింగ్ చేయడానికి రూ. 23 సంపాదించానని, అందులో రూ. 10 'ట్రావెల్ పే', అలాగే రూ.13 'సర్జ్ బోనస్' కూడా ఉన్నాయని వివరించాడు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం