తెలుగు న్యూస్ / career /
Supreme Court Jobs : సుప్రీంకోర్టులో 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తు విధానం ఇలా
Supreme Court Jobs : సుప్రీంకోర్టులో 107 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 25వ తేదీలోపు సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
సుప్రీంకోర్టులో 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తు విధానం ఇలా
సుప్రీంకోర్టులో 107 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్ www.sci.gov.inలో సమర్పించవచ్చు.
ఇతర వివరాలు
- పోస్టులు - కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు
- మొత్తం ఖాళీల సంఖ్య - 107
- కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్): 31
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్: 33
- పర్సనల్ అసిస్టెంట్ : 43
- అప్లికేషన్ మోడ్ - ఆన్‌లైన్
- దరఖాస్తుకు చివరి తేదీ- 25 డిసెంబర్ 2024
- అధికారిక వెబ్‌సైట్- www.sci.gov.in
అర్హతలు
- కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్) - 30 నుంచి 45 సంవత్సరాల వయోపరిమితి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ, షార్ట్‌హ్యాండ్‌లో ప్రావీణ్యం (ఇంగ్లీష్‌లో 120 wpm) 40 wpm వేగంతో టైపింగ్ చేయాలి.
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ -వయోపరిమిత 18 నుంచి 30 సంవత్సరాలు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, షార్ట్‌హ్యాండ్‌లో నైపుణ్యం (ఇంగ్లీష్‌లో 110 wpm), 40 wpm టైపింగ్ వేగంతో కంప్యూటర్ పరిజ్ఞానం.
- పర్సనల్ అసిస్టెంట్ - 18 నుంచి 30 సంవత్సరాలు వయోపరిమితి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, షార్ట్‌హ్యాండ్‌లో నైపుణ్యం (ఇంగ్లీష్‌లో 100 wpm), 40 wpm టైపింగ్ వేగంతో కంప్యూటర్ పరిజ్ఞానం.
దరఖాస్తు రుసుము
- జనరల్/ఓబీసీ అభ్యర్థులు - రూ.1000
- ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ, ఇతర రిజర్వు కేటగిరీలు - రూ.250
ఎంపిక ప్రక్రియ
- టైపింగ్ స్పీడ్ టెస్ట్ : అభ్యర్థులు కంప్యూటర్‌లో 40 వర్డ్స్ పర్ మినిట్ వేగంతో టైప్ చేయడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. నిర్ణీత ఎర్రర్ పరిమితి ఉంటుంది.
- షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్) పరీక్ష : కోర్టు మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల కోసం వరుసగా 120, 110 wpm వేగంతో షార్ట్‌హ్యాండ్ పరీక్ష నిర్వహిస్తారు.
- రాత పరీక్ష : కోర్టు మాస్టర్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది.
- ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూ రౌండ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
సుప్రీంకోర్టు రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
- ముందుగా సుప్రీంకోర్టు వెబ్‌సైట్ https://www.sci.gov.in/ పై క్లిక్ చేయండి.
- హోమ్‌పేజీలోని నోటీసు ట్యాబ్ లోని రిక్రూట్‌మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు ఫారమ్‌లో విద్యార్హతలు, అనుభవం, ఇతర వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్‌ల స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- అన్ని వివరాలను ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
సంబంధిత కథనం