UGC on NALSAR: నల్సార్ డిస్టెన్స్ కోర్సుల్లో యూజీసీ నిషేధం, విద్యార్థులు డిస్టెన్స్ కోర్సుల్లో చేరొద్దని సూచన
UGC on NALSAR: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నల్సార్ దూర విద్యా విధానంలో అందించే కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు చేరొద్దని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. నల్సార్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌కు యూజీసీ గుర్తింపు లేదు.
UGC on NALSAR: హైదరాబాద్‌లోని నల్సార్ దూర విద్యా విధానంలో అందించే కోర్సులకు యూజీసీ గుర్తింపు లేదని వాటిలో విద్యార్థులు చేరొద్దని యూజీసీ ప్రకటించింది. నల్సార్ దూరవిద్యలో అందించే కోర్సులపై యూజీసీ నిషేధం విధించింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఈ కోర్సుల్లో విద్యార్థులు ఎవరూ ప్రవేశాలు పొందవద్దని యూజీసీ ప్రకటించింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
నల్సార్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆన్లైన్ లైన్, దూరవిద్యా విధానంలో అందిస్తున్న కోర్సులపై యూజీసీ నిషేధం విధిం చింది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25లో నల్సార్ వర్సిటీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సుల్లో ఎవరూ చేరొద్దని యూజీసీ హెచ్చరించింది.
నల్సార్ వర్సిటీ కొన్నేళ్లుగా ఆన్లైన్, దూరవిద్యలో పలు రకాల లీగల్ కోర్సులను అందిస్తోంది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఇతరులూ కూడా ఈ కోర్సుల్లో చేరి విద్యాభ్యాసం చేస్తున్నారు.
దూర విద్యలో కోర్సుల్ని అందించాలంటే యూజీసీ మార్గదర్శకాలు పాటించడంతో పాటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నల్సార్ వర్సిటీ అందించే కోర్సులు యూజీసీ నిబంధనలు పాటిం చకపోవడం, దూర విద్యలో ఆ సంస్థ అందిస్తున్న కోర్సులపై లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆ కోర్సులపై ఏడాది పాటు నిషేధం విధించారు.
నిషేధం ముగిసిన తర్వాత కోర్సులకు అనుమతి కోసం మళ్లీ దరఖాస్తు చేసు కోవచ్చని యూజీసీ పేర్కొంది. దేశంలోనే న్యాయవిద్యను అందించే కోర్సుల్లో నల్సార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1998లో న్యాయవిద్యలో సంస్కరణల కోసం యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. దేశంలో సైబర్ లాలతో పాటు రక్షణ సంబంధిత అంశాలపై కూడా నల్సార్ కోర్సుల్ని అందిస్తోంది. యూజీసీ అనుమతుల రద్దు చేయడంపై నల్సార్ స్పందించాల్సి ఉంది.