12వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు- ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ నోటిఫికేషన్​ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!-ssc stenographer grade c d exam 2025 notification out for 261 posts see details inside ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  12వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు- ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ నోటిఫికేషన్​ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!

12వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు- ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ నోటిఫికేషన్​ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu

ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీ, పోస్టులు, అర్హత వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నిరుద్యోగులకు శుభవార్త!

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్​ని విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి' & 'డి' ఎగ్జామినేషన్, 2025 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ లింక్​ని పొందవచ్చు.

ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్​ నోటిఫికేషన్​- ముఖ్యమైన తేదీలు..

ఎస్​ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025కి​ దరఖాస్తుకు చివరి తేదీ 2025 జూన్ 26 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్​లైన్​ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 27 జూన్ 2025. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 261 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫారంలో సవరణలు చేయడానికి జులై 1 నుంచి జులై 2, 2025 వరకు అవకాశం ఉంది.

సవరించిన/ సరిదిద్దిన దరఖాస్తును తొలిసారి తిరిగి సబ్మిట్ చేయడానికి రూ.200, రెండోసారి సవరించిన/ సరిదిద్దిన దరఖాస్తును తిరిగి సబ్మిట్ చేయడానికి రూ.500/-. ఏకరీతి కరెక్షన్ ఛార్జీలను కమిషన్ వసూలు చేస్తుంది. జెండర్/కేటగిరీతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ కరెక్షన్ ఛార్జీలు వర్తిస్తాయి. కరెక్షన్ ఛార్జీలను భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఆన్​లైన్ మోడ్ ద్వారా చెల్లించవచ్చు.

ఎంపిక విధానం..

ఎస్​ఎఎస్సీ స్టెనోగ్రాఫర్​ గ్రేడ్​ సీ- డీ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2025 ఆగస్టు 6 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్​పై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష 2 గంటల పాటు ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ చాయిస్​గా మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి.

అర్హత..

కటాఫ్ తేదీ నాటికి అంటే 01.08.2025 నాటికి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు రూ.100. రిజర్వేషన్​కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ (ఈఎస్ ఎం)లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి మాత్రమే ఫీజు చెల్లించవచ్చు.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం