వివిధ ఎస్‌ఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కీలక అలర్ట్! కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్), జనరల్ డ్యూటీ (జీడీ), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) 2026 పరీక్షలకు ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)’ను తప్పనిసరి చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్సీ). ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎస్‌ఎస్సీ ఓటీఆర్ కోసం రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ చాలా సులభం :
స్టెప్ 1- ముందుగా, ssc.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2- "లాగిన్ లేదా రిజిస్టర్" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- తరువాత, "రిజిస్టర్" బటన్‌ను నొక్కండి.
స్టెప్ 4- మీ పేరు, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ నంబర్, సంప్రదింపు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయండి.
స్టెప్ 5- కొత్త పాస్‌వర్డ్‌ను సృష్టించండి.
స్టెప్ 6- అదనపు వివరాలను ఎంటర్ చేసి, మీరు నమోదు చేసిన సమాచారం సరైనదని ధృవీకరిస్తూ డిక్లరేషన్‌ను నిర్ధారించండి.
ఈ ప్రక్రియ పూర్తవగానే, మీరు అన్ని పరీక్షల కోసం విజయవంతంగా రిజిస్టర్ అవుతారు.
ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి, మీ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కోసం ఈ కింది వివరాలు లేదా పత్రాలు అవసరం:
మొబైల్ నంబర్
ఈమెయిల్ ఐడీ
ఆధార్ నంబర్ లేదా పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధృవీకరణ పత్రం, స్కూల్ సర్టిఫికెట్లు, యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ పాస్‌బుక్, అద్దె ఒప్పందం (వీటిలో ఏదైనా ఒకటి)
మెట్రిక్యులేషన్ (10వ తరగతి) పరీక్షలో బోర్డు, రోల్ నంబర్ మరియు ఉత్తీర్ణత సంవత్సరం గురించిన సమాచారం
మీ అత్యధిక విద్యార్హత గురించిన సమాచారం
వికలాంగత్వ ధృవీకరణ పత్రం నంబర్ (ఏదైనా ఉంటే,)
కుల ధృవీకరణ పత్రం (ఏదైనా ఉంటే,)
ముఖ్య గమనిక: వన్ టైమ్ రిజిస్ట్రేషన్ వివరాలను పూరించేటప్పుడు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే ఎస్‌ఎస్సీ మీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయవచ్చు.
ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల కోసం ఎస్‌ఎస్సీ ఓటీఆర్ ఫారం కరెక్షన్ విండో జూన్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కి కూడా జూన్ 30 చివరి తేది అని గుర్తుపెట్టుకోవాలి.