SSC MTS 2024 final results: ఎస్ఎస్సీ ఎంటీఎస్ 2024 తుది ఫలితాలు విడుదల
SSC MTS 2024 final results: మల్టీ టాస్కింగ్ (Non-Technical) స్టాఫ్ అండ్ హవల్దార్ (CBIC & CBN) తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గురువారం విడుదల చేసింది. ఎంటీఎస్ పోస్టుకు 8,079 మంది, హవల్దార్ పోస్టుకు 3,439 మంది చొప్పున మొత్తం 11,518 మంది అభ్యర్థులను కమిషన్ షార్ట్ లిస్ట్ చేసింది.

SSC MTS 2024 final results: మల్టీ టాస్కింగ్ (Non-Technical) స్టాఫ్ అండ్ హవల్దార్ (CBIC & CBN) తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఆయా సంస్థల్లో నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొత్తం 11,518 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసింది, వీరిలో 8,079 మంది ఎంటీఎస్ పోస్టుకు, 3,439 మంది హవల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను ఎస్సెస్సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
ఎంటీఎస్, హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ)ను 2024 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 14 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఎస్ఎస్సీ నిర్వహించింది. ఈ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఈటీ/ పీఎస్టీ) కోసం 27,011 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. ఫిబ్రవరి 5 నుంచి 12 వరకు దేశవ్యాప్తంగా కేంద్రాల్లో ఈ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ జరిగింది.
179 మంది అభ్యర్థుల ఫలితాల నిలుపుదల
అవకతవకలు జరిగాయనే అనుమానంతో 179 మంది అభ్యర్థుల ఫలితాలను నిలుపుదల చేశామని, 504 మంది అభ్యర్థుల ఫలితాలను రద్దు/డీబార్/తిరస్కరణ కారణంగా ప్రాసెస్ చేయలేదని ఎస్ఎస్సీ తెలిపింది. మొత్తం 198 మంది దివ్యాంగ అభ్యర్థులు పరీక్ష నోటిఫికేషన్ లో పేర్కొన్న బెంచ్ మార్క్ డిజెబిలిటీ ప్రకారం హవల్దార్ పోస్టుకు అర్హులు కాదని కమిషన్ తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థుల పత్రాలను క్రోడీకరించి అధికారిక వెబ్సైట్లో ఈ-డాసియర్ మాడ్యూల్ ద్వారా అభ్యర్థులతో పంచుకుంటామని తెలిపింది.
అభ్యంతరాలుంటే కమిషన్ కు ఫిర్యాదు చేయండి
ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు నెల రోజుల్లోగా తమకు తెలియజేయాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపింది. ఎంపిక కావడం, ఎంపిక చేయకపోవడం, పోస్టుల కేటాయింపు తదితర అంశాల్లో ఏదైనా వ్యత్యాసం ఉంటే అభ్యంతరాలను తెలియజేవచ్చని చెప్పింది. ఈ నియామకంలో రిజర్వ్ లేదా వెయిటింగ్ లిస్ట్ ను రూపొందించడం లేదని ఎస్సెస్సీ తెలిపింది. అభ్యర్థులు చేరకపోవడం వల్ల ఏర్పడిన ఖాళీలు తదుపరి రిక్రూట్మెంట్ కు క్యారీ ఫార్వర్డ్ అవుతాయని తెలిపింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీకి అభ్యర్థుల విజ్ఞప్తులను సమీక్షించామని, అవసరమైన చోట తుది వెర్షన్ ను సిద్ధం చేసేలా మార్పులు చేశామని ఎస్ఎస్సీ తెలిపింది. క్వాలిఫైడ్/నాన్ క్వాలిఫైడ్ అభ్యర్థుల ఫైనల్ ఆన్సర్ కీ, మార్కులను త్వరలోనే కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఎస్ఎస్సీ ఫలితాల నోటిఫికేషన్ లో తెలిపింది.
సంబంధిత కథనం