ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2025 సవరించిన తాత్కాలిక ఖాళీల జాబితా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాం రైఫిల్స్ లో ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లోని రైఫిల్మన్ (జీడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయిల్లో మొదట 39,481 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా, ఆ ఖాళీల సంఖ్యను సవరించారు. సవరించిన తాత్కాలిక ఖాళీల జాబితా ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాం రైఫిల్స్ లో ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లోని రైఫిల్మన్ (జీడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయిల్లో 53,690 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 25 వరకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ లో ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లోని రైఫిల్మన్ (జీడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయిల్లో 39,481 ఖాళీల భర్తీకి కానిస్టేబుల్ (జీడీ) పరీక్ష నిర్వహించింది. సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ద్వారానే అత్యధిక ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 53,690 ఖాళీల్లో సీఐఎస్ఎఫ్ 16,571, బీఎస్ఎఫ్ 16,371, సీఆర్పీఎఫ్ 14,359, ఐటీబీపీ 3,468, ఏఆర్ 1,865, ఎస్ఎస్బీ 902, ఎస్ఎస్ఎఫ్ 132, ఎన్సీబీ 22 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
మొత్తం 53,690 ఖాళీల్లో కేవలం 5370 మాత్రమే మహిళా అభ్యర్థులకు, మిగిలిన 4,8320 పోస్టులు పురుష అభ్యర్థులకు కేటాయించారు. ఎస్ ఎస్ సీ (జీడీ) కానిస్టేబుల్ 2025 ఫలితాలను ఎస్ ఎస్ సీ ఇంకా విడుదల చేయలేదు. అంతకుముందు తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ ఆన్సర్ కీ లోని సమాధానాలను అభ్యర్థులు సవాలు చేయడానికి మార్చి 9, 2025 సమయం ఇచ్చారు. ఫైనల్ ఆన్సర్ కీని ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో చూసుకోవచ్చు.
ఎస్ఎస్సీ జీడీ పరీక్షలో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన పురుష, మహిళా అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ కు పిలుస్తారు. పీఎస్టీ/ పీఈటీకి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల సంఖ్య ఖాళీల సంఖ్యకు 8 రెట్లు ఉంటుంది.
సంబంధిత కథనం