SSC GD 2024 final score card: ఎస్ఎస్సీ జీడీ 2024 ఫైనల్ స్కోర్ కార్డులు విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..-ssc gd 2024 final score cards out candidates can download via direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ssc Gd 2024 Final Score Card: ఎస్ఎస్సీ జీడీ 2024 ఫైనల్ స్కోర్ కార్డులు విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

SSC GD 2024 final score card: ఎస్ఎస్సీ జీడీ 2024 ఫైనల్ స్కోర్ కార్డులు విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

Sudarshan V HT Telugu

SSC GD 2024 final score cards: ఎస్ఎస్సీ జీడీ 2024 ఫైనల్ స్కోర్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురువారం విడుదల చేసింది. కమిషన్ ఓల్డ్ వెబ్సైట్ ssc.nic.in నుంచి అభ్యర్థులు ఈ ఫైనల్ స్కోర్ కార్డ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వబడింది.

ఎస్ఎస్సీ జీడీ 2024 ఫైనల్ స్కోర్ కార్డులు

SSC GD 2024 final score cards: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025 ఫిబ్రవరి 27 గురువారం ఎస్ఎస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్ 2024 స్కోర్ కార్డులను విడుదల చేసింది. రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పాత వెబ్ సైట్ నుంచి తమ స్కోర్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎస్ఎస్సీ జీడీ ఫైనల్ స్కోర్ కార్డు డౌన్లోడ్

2024 డిసెంబర్ 13న అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మెన్ (GD) తుది ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. ఫలితాల్లో మొత్తం 4891 మంది మహిళా అభ్యర్థులను, 39375 మంది పురుష అభ్యర్థులను వివిధ పోస్టులకు కమిషన్ ఎంపిక చేసింది. కోర్టు ఆదేశాలు/ అనుమానాస్పద అవకతవకల కారణంగా 845 మంది అభ్యర్థుల తుది ఫలితాలను నిలిపివేశారు. ఎంపికైన, ఎంపిక కాని అభ్యర్థుల సమగ్ర మార్కులను త్వరలోనే అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని కమిషన్ నాడు తెలిపింది.

ఫైనల్ స్కోర్ కార్డ్

2025 ఫిబ్రవరి 27న జారీ చేసిన అధికారిక నోటీసులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలా పేర్కొంది, "సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఎస్ఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్, 2024 లో రైఫిల్ మన్ (GD) తుది ఫలితాలను కమిషన్ 13.12.2024 న ప్రకటించింది. 2024 అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మన్ (GD)లో పీఎస్టీ/పీఈటీ, డీవీ/డీఎంఈ/ఆర్ఎంఈ ఇన్ కానిస్టేబుల్ (జీడీ) పరీక్షలకు హాజరయ్యేందుకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులందరి తుది మార్కులను అప్లోడ్ చేయాలని కమిషన్ నిర్ణయించింది’’ అని వెల్లడించింది.

మార్చి 13 వరకు అందుబాటులో

స్కోర్ కార్డులను ఎస్సెస్సీ పాత వెబ్ సైట్ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ యూజర్ నేమ్, పాస్ వర్డ్ (రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్) ఉపయోగించి లాగిన్ అయ్యి అభ్యర్థి డ్యాష్ బోర్డులోని రిజల్ట్/ మార్క్స్ ట్యాబ్ పై క్లిక్ చేయడం ద్వారా తమ వ్యక్తిగత మార్కులను చెక్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, అభ్యర్థులు దాని ప్రింట్అవుట్ ను భద్రపర్చుకోవాలని సూచించింది.

46617 పోస్టుల భర్తీ

46617 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ జీడీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించగా అందులో బీఎస్ఎఫ్ కు 12076, సీఐఎస్ఎఫ్ కు 13632, సీఆర్పీఎఫ్ కు 9410, ఎస్ఎస్బీ కి 1926, ఐటీబీపీకి 6287, ఏఆర్ కు 2990, ఎస్ఎస్ఎఫ్ కు 296 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం