సీజీఎల్ సహా పలు ఎస్సెస్సీ పరీక్షల తేదీలు మారాయి; సవరించిన ఎస్సెస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2025 ను ఇక్కడ చెక్ చేయండి-ssc exam calendar 2025 revised check cgl chsl mts je exam dates more ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీజీఎల్ సహా పలు ఎస్సెస్సీ పరీక్షల తేదీలు మారాయి; సవరించిన ఎస్సెస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2025 ను ఇక్కడ చెక్ చేయండి

సీజీఎల్ సహా పలు ఎస్సెస్సీ పరీక్షల తేదీలు మారాయి; సవరించిన ఎస్సెస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2025 ను ఇక్కడ చెక్ చేయండి

Sudarshan V HT Telugu

ఎగ్జామ్ క్యాలెండర్ 2025ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సవరించింది. సవరించిన ఎగ్జామ్ క్యాలెండర్ 2025ను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఢిల్లీ పోలీస్ లో సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎస్ఐ, ఎంటీఎస్, జేఈ, ఇతర నోటిఫికేషన్ల తేదీలను అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఎస్సెస్సీ ఎగ్జామ్ క్యాలెండర్

2025-26 సెషన్ లో షెడ్యూల్ అయిన ఎస్ఎస్సీ పరీక్షలకు సంబంధించిన సవరించిన క్యాలెండర్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శనివారం విడుదల చేసింది. కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలకు హాజరు కావాలనుకునే ఎస్సెస్సీ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో సవరించిన లేటెస్ట్ క్యాలెండర్ ను చూడవచ్చు.

ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ల తేదీలలో మార్పులు

సవరించిన క్యాలెండర్ ప్రకారం

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి' & 'డి' పరీక్ష, 2025 నోటిఫికేషన్ 2025 జూన్ 5 న వెలువడుతుంది మరియు అదే రోజు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 26, 2025, పరీక్ష ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11, 2025 వరకు నిర్వహిస్తారు.
  • అదేవిధంగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్షలకు 2025 జూన్ 9 నుంచి జూలై 4 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
  • ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2025 రిజిస్ట్రేషన్లు 2025 జూన్ 16 నుంచి జూలై 7, 2025 వరకు, పరీక్ష సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6, 2025 వరకు నిర్వహిస్తారు.
  • కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) స్థాయి పరీక్ష, 2025 కోసం రిజిస్ట్రేషన్లు 2025 జూన్ 23 నుంచి జూలై 18, 2025 వరకు జరగనున్నాయి. పరీక్షలు 2025 సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 18 వరకు జరుగుతాయి.
  • జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్-2025 రిజిస్ట్రేషన్లు జూన్ 30 నుంచి జూలై 21 వరకు జరగనున్నాయి. 2025 అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఈ పరీక్ష జరగనుంది.
  • మల్టీ టాస్కింగ్ (నాన్టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఎగ్జామినేషన్-2025 రిజిస్ట్రేషన్లు జూన్ 26, 2025 నుంచి ప్రారంభమై జూలై 24, 2025తో ముగుస్తాయి. ఈ పరీక్షను సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు నిర్వహించనున్నారు.

ఎస్ఎస్సీ ఎగ్జామ్ రివైజ్డ్ క్యాలెండర్ 2025: డౌన్లోడ్ ఎలా?

అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా ఎస్ఎస్సీ సవరించిన క్యాలెండర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. ముందుగా ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  2. హోమ్ పేజీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ టెంపరరీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఎస్ఎస్సీ రివైజ్డ్ ఎగ్జామ్ క్యాలెండర్ పీడీఎఫ్ మీ స్క్రీన్ పై ఓపెన్ అవుతుంది.
  4. భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు డౌన్ లోడ్ చేసి ప్రింట్ అవుట్ ఉంచండి..

మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం