SSC Constable GD: ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ 2025 ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి; తెలుగులో కూడా ప్రశ్నాపత్రం
SSC Constable GD Exam 2025 dates: ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2025 తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in లో పరీక్ష తేదీలు, ఇతర వివరాలను చూసుకోవచ్చు.
SSC Constable GD Exam 2025 dates: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2025 తేదీలను ప్రకటించింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాం రైఫిల్స్ లో ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ లో సిపాయి పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో అధికారిక నోటిఫికేషన్ ను చూడవచ్చు.
ఫిబ్రవరి 4 నుంచి..
ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ 2025 పరీక్షలు ఫిబ్రవరి తొలి వారంలో ప్రారంభం కానున్నాయి. 2025 ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (). ఈ సీబీటీ 160 మార్కులకు (80 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. పరీక్ష నాలుగు భాగాలుగా ఉంటుంది- పార్ట్ ఎ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్ డి ఇంగ్లిష్ / హిందీ.
తెలుగులో కూడా ప్రశ్నాపత్రం
ఇంగ్లిష్, హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
మొత్తం 39,481 పోస్టుల భర్తీ
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్సెస్సీ (staff selection commission) మొత్తం 39,481 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాం రైఫిల్స్ లో ఎస్ ఎస్ ఎఫ్, రైఫిల్ మెన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి పోస్టులున్నాయి. నియామక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), తరువాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.
ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2025: ఖాళీలు
- బీఎస్ఎఫ్: 15654 ఖాళీలు
- సీఐఎస్ఎఫ్: 7145 ఖాళీలు
- సీఆర్పీఎఫ్: 11541 ఖాళీలు
- ఎస్ఎస్బీ: 819 ఖాళీలు
- ఐటీబీపీ: 3017 ఖాళీలు
- ఏఆర్: 1248 ఖాళీలు
- ఎస్ఎస్ఎఫ్: 35 ఖాళీలు
- ఎన్సీబీ: 22 ఖాళీలు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 5న ప్రారంభమై 2024 అక్టోబర్ 14న ముగిసింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.