SSC Constable GD 2025: ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ 2025 అప్లికేషన్ స్టేటస్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..-ssc constable gd 2025 application status released direct link to check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ssc Constable Gd 2025: ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ 2025 అప్లికేషన్ స్టేటస్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

SSC Constable GD 2025: ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ 2025 అప్లికేషన్ స్టేటస్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu

SSC Constable GD 2025: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ లో ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్-2025లో సిపాయి పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అప్లికేషన్ స్టేటస్ ను విడుదల చేసింది.

ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ 2025 అప్లికేషన్ స్టేటస్ విడుదల (HT file)

SSC Constable GD 2025: కానిస్టేబుల్ జీడీ 2025 అప్లికేషన్ స్టేటస్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ లో ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్-2025లో సిపాయి పోస్టుల భర్తీకి గానూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గతంలో దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ దరఖాస్తులకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ ను జనవరి 24న ఎస్సెస్సీ విడుదల చేసింది. కర్ణాటక కేరళ ప్రాంతంలోని అభ్యర్థుల దరఖాస్తు స్థితిని ssckkr.kar.nic.in వెబ్సైట్ లో విడుదల చేశారు.

పరీక్ష గురించి

కానిస్టేబుల్ జీడీ రాత పరీక్ష 2025 ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో జరుగుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (staff selection commission) ఇంగ్లీష్, హిందీ, 13 ప్రాంతీయ భాషల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) నిర్వహిస్తుంది. పరీక్షలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 80 ప్రశ్నలతో కూడిన ఆబ్జెక్టివ్ తరహా పేపర్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కులు ఉంటాయి.

సాయుధ దళాల్లో..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్ (AR) లో రైఫిల్మెన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)లో సిపాయి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు రిజిస్టర్ చేసుకుని, తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి స్టెప్స్

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
  • హోం పేజీలో కానిస్టేబుల్ జీడీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • అభ్యర్థుల అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.
  • భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్ తీసుకోవచ్చు.
  • మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.