కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) పరీక్ష 2025 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 18 లోపు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా SSC CHSL 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏమైనా సమస్యలు ఉంటే సంప్రదించాల్సిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 18003093063
ఈ సంవత్సరం ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ ద్వారా సుమారు 3,131 ఖాళీల భర్తీ జరగనుంది. ఖాళీల తుది సంఖ్య త్వరలో వెల్లడి కానుంది. పోస్ట్, కేటగిరీ వారీగా ఖాళీల వివరాలను ఎస్ఎస్సీ తన వెబ్‌సైట్ ssc.gov.inలో త్వరలో తెలియజేస్తుంది. రాష్ట్రాల వారీగా, జోన్ల వారీగా ఖాళీల వివరాలు తమ వద్ద ఉండవని, ఈ సమాచారం కోసం సంబంధిత యూజర్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలని కమిషన్ అభ్యర్థులకు సూచించింది.
జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, జనవరి 2, 1999కి ముందు, జనవరి 1, 2008 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. నిబంధనల ప్రకారం రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ‘ఏ’ (మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్టులకు): సైన్స్ స్ట్రీమ్‌లో గణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎల్డీసీ/జేఎస్ఏ, డీఈఓఏ/డీఈఓ గ్రేడ్ ‘A’ (డిపార్ట్‌మెంట్/మినిస్ట్రీలలోని డీఈఓలు మినహా): ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు జనవరి 1, 2026 నాటికి తప్పనిసరిగా అవసరమైన విద్యార్హతను కలిగి ఉండాలి.
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2025 దరఖాస్తు ఫీజు రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూబీడీ, రిజర్వేషన్‌కు అర్హులైన ఎక్స్-సర్వీస్‌మెన్ (ఈఎస్ఎం) అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఎస్ఎస్సీ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.
సంబంధిత కథనం