తెలుగు న్యూస్ / career /
SSC CGL Tier I results 2024: ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ఫలితాలు 2024 వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..
SSC CGL Tier I results 2024: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) టైర్ 1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ఫలితాలు 2024 వెల్లడి
SSC CGL Tier I results 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) టైర్ 1 పరీక్ష ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in లో తమ స్కోర్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 పరీక్షను 2024 సెప్టెంబర్ 9 నుంచి 24 వరకు నిర్వహించగా, 2024 అక్టోబర్ 3న ప్రొవిజనల్ ఆన్సర్ కీని కమిషన్ (staff selection commission) విడుదల చేసింది. 2024 అక్టోబర్ 8న ఆబ్జెక్షన్ విండో ముగిసింది.
ఖాళీల వివరాలు
ఎస్ఎస్సీ సీజీఎల్ 2024 రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన 17727 గ్రూప్ 'బి', గ్రూప్ 'సి' ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- ఎస్సెస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in ను సందర్శించండి.
- టైర్ 1 ఎగ్జామ్ రిజల్ట్ లింక్ ఓపెన్ చేయండి.
- పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకుని రోల్ నంబర్ ఉపయోగించి మీ రిజల్ట్ చెక్ చేసుకోండి.
- మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.