SSC CGL final result 2024: ఎస్ఎస్సీ సీజీఎల్ ఫైనల్ రిజల్ట్స్ విడుదల; ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
SSC CGL final result 2024: ఎస్ఎస్సీ సీజీఎల్ 2024 ఫైనల్ రిజల్ట్ విడుదల అయ్యాయి. పోస్టుల మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా 18,174 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వారి నియామకాలకు కమిషన్ సిఫారసు చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను కింద చూపిన స్టెప్స్ ఫాలో కావడం ద్వారా చూసుకోవచ్చు.

SSC CGL final result 2024: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (CGL) 2024 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గురువారం విడుదల చేసింది. ఫలితాలతో పాటు కేటగిరీ, పోస్టుల వారీగా కటాఫ్ మార్కులను కూడా కమిషన్ ప్రకటించింది. అభ్యర్థులు ఈ వివరాలను ఎస్ఎస్ఈ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in లో చెక్ చేసుకోవచ్చు. పోస్టుల మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 18,174 మంది అభ్యర్థుల నియామకాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిఫారసు చేసింది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆయా యూజర్ డిపార్ట్ మెంట్లు నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ కు హాజరవుతారు.
డిసెంబర్ టైర్ 1 ఫలితాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024 డిసెంబర్ 5 న ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఫలితాలను ప్రకటించింది. జనవరి 18, 19, 20, 31 న కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి) విధానంలో టైర్ 2 పరీక్షను నిర్వహించింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థుల మధ్య వారు సాధించిన మార్కులను బట్టి టై ఏర్పడితే ఈ క్రింది క్రమంలో మెరిట్ ను నిర్ణయించారు.
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్ వో), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 (ఎస్ ఐ)లకు పేపర్ 2లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తరువాత
- టైర్-2 పరీక్షలో సెక్షన్ 1, పేపర్-1లో మార్కులు పరిశీలిస్తారు.
- ఆ తరువాత పుట్టిన తేదీ చూస్తారు. వయస్సు ఎక్కువ ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత లభిస్తుంది. చివరగా, అభ్యర్థుల పేర్ల అక్షర క్రమాన్ని పరిశీలిస్తారు.
హోల్డ్ లో 1,267 మంది అభ్యర్థుల తుది ఫలితాలు
1,267 మంది అభ్యర్థుల తుది ఫలితాలను కమిషన్ నిలుపుదల చేసిందని, 253 మంది అభ్యర్థులను డీబార్ చేసిందని తెలిపింది. కేటాయించిన శాఖల ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్, నియామక ఫార్మాలిటీస్ చేపడతామని ఎస్ఎస్సీ తెలిపింది. సిఫార్సు చేసిన అభ్యర్థికి ఆరు నెలల్లోగా కేటాయించిన యూజర్ డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు రాకపోతే వెంటనే ఆ శాఖతో సంప్రదింపులు జరపాలని తెలిపింది.
వెయిటింగ్ లిస్ట్ ఉండదు
ఎస్ఎస్సీ సీజీఎల్ 2024 కోసం ఎటువంటి రిజర్వ్ జాబితా లేదా వెయిటింగ్ లిస్ట్ ను తయారు చేయబోమని, భర్తీ చేయని ఖాళీలు తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయని ఎస్ఎస్సీ తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థుల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో జనరేట్ చేసి ఎస్ఎస్సీ వెబ్సైట్ లో ఈ-డోసియర్ మాడ్యూల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు సమర్పించిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించామని, అవసరమైన చోట ఆన్సర్ కీని సవరించామని కమిషన్ తెలిపింది. తుది ఆన్సర్ కీ, ఎంపికైన/ఎంపిక కాని అభ్యర్థుల సవివరమైన మార్కులను త్వరలోనే వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనున్నారు.
సంబంధిత కథనం