14582 పోస్ట్ ల రిక్రూట్మెంట్; దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్; ఈ డైరెక్ట్ లింక్ తో అప్లై చేసుకోండి-ssc cgl exam 2025 registration ends tomorrow at sscgovin ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  14582 పోస్ట్ ల రిక్రూట్మెంట్; దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్; ఈ డైరెక్ట్ లింక్ తో అప్లై చేసుకోండి

14582 పోస్ట్ ల రిక్రూట్మెంట్; దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్; ఈ డైరెక్ట్ లింక్ తో అప్లై చేసుకోండి

Sudarshan V HT Telugu

14582 పోస్ట్ ల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జూలై 4, 2025తో ముగుస్తుంది. 14582 ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇవ్వబడింది.

ఎస్ఎస్సీ సీజీఎల్ ఎగ్జామ్ 2025

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ సీజీఎల్ ఎగ్జామ్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలై 4, 2025న ముగించనుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2025 కు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు చివరితేదీ 5 జూలై 2025. కరెక్షన్ విండో జూలై 9న ప్రారంభమై జూలై 11, 2025న ముగుస్తుంది.

ఆగస్ట్ లో పరీక్షలు

ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 టైర్-1 పరీక్ష 2025 ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు, టైర్-2 పరీక్ష 2025 డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా 14582 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో ఉన్న డీటెయిల్డ్ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులందరూ ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.

  1. ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  2. హోమ్ పేజీలో ఉన్న లాగిన్ లింక్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  4. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
  5. అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  6. సబ్మిట్పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
  7. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

దరఖాస్తు ఫీజు

ఈ పరీక్షకు దరఖాస్తు చేయడానికి ఫీజు రూ.100. రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. భీమ్ యుపిఐ, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

ఎస్ఎస్సీ సీజీఎల్ ఎగ్జామ్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం