SSC CGL 2024: ఎస్ఎస్సీ సీజీఎల్ 2024 టైర్ 1 అడిషనల్ రిజల్ట్స్ విడుదల
SSC CGL 2024: ఎస్ఎస్సీ సీజీఎల్ 2024 టైర్ 1 అడిషనల్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు టైర్ 2 పరీక్షకు హాజరుకావచ్చు.
SSC CGL 2024: ఎస్ఎస్సీ సీజీఎల్ 2024 టైర్ 1 అదనపు ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ఈ), టైర్ 1 2024కు హాజరైన అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
మొత్తం 1 లక్షకు పైగా …
టైర్-1 ఫలితాల్లో లిస్ట్-1లో (జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు) మొత్తం 18,436 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయగా, లిస్ట్-2లో (స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 పోస్టుకు) టైర్-2 (పేపర్-1, పేపర్-2 (స్టాటిస్టిక్స్)లో మొత్తం 2833 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. లిస్ట్-3లో మొత్తం 1,65,240 మంది అభ్యర్థులను టైర్-2 (పేపర్-1)కు (మిగతా అన్ని పోస్టులకు) షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు టైర్-2 పరీక్షకు హాజరుకావచ్చని కమిషన్ తెలిపింది. టైర్-2 పరీక్షను 2025 జనవరి 20న నిర్వహించనున్నారు.
ఇలా చెక్ చేసుకోండి..
ఎస్ఎస్సి (staff selection commission) సిజిఎల్ 2024 టైర్ 1 అడిషనల్ రిజల్ట్స్ ను అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించి తెలుసుకోవచ్చు.
1.ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in ను సందర్శించండి.
2. రిజల్ట్ లింక్ పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
3. ఆ పేజీలో అందుబాటులో ఉన్న ఎస్ఎస్సి సిజిఎల్ 2024 టైర్ 1 అదనపు ఫలితాల జాబితాపై క్లిక్ చేయండి.
4. రోల్ నెంబర్లు చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
5. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.