Srikakulam Jobs : శ్రీకాకుళం జిల్లాలో 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి
Srikakulam Jobs : శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థల్లో 42 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని పీహెచ్‌సీల్లో 6 పోస్టులు, జనరల్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్లో 6 పోస్టులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లో 30 పోస్టులు భర్తీ చేయనున్నారు.
Srikakulam Jobs : శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తును దాఖలు చేసుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 22గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగాల భర్తీకి సీడాప్ ద్వారా మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్‌గా పని చేసేందుకు 30 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు జనవరి 20 ఆఖరు తేదీగా నిర్ణయించారు.

మొత్తం పోస్టులు
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో జిల్లాలోని పీహెచ్‌సీల్లో 6 పోస్టులు, జిల్లా జనరల్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్లో 6 పోస్టులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లో 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
1. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న పలు పీహెచ్‌సీల్లో పని చేసేందుకు ల్యాబ్‌టెక్నిషియన్-1 (కాంట్రాక్టు), ఎఫ్ఎన్‌వో-5 (ఔట్ సోర్సింగ్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ తెలిపారు. వయస్సు 42 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్ మాన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో https://cdn.s3waas.gov.in/s3f899139df5e1059396431415e770c6dd/uploads/2025/01/2025011740.pdf చూడొచ్చు. అలాగే దరఖాస్తు ఫారమ్‌ను ఈ వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3f899139df5e1059396431415e770c6dd/uploads/2025/01/2025011786.pdf ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి దాఖలు చేయాలని ఉంటుంది.
2. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఎన్ఆర్‌హెచ్ఎం, జిల్లా జనరల్ హాస్పటల్, జిల్లా హాస్పటల్లో పని చేసేందుకు ఫిజీషియన్-1, మెడికల్ ఆఫీసర్ -2, క్లినికల్ సైకాలజిస్టు-1, ఆఫ్తమాలజిస్టు-1, డెంటల్ టెక్నీషియన్01 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ తెలిపారు. వయస్సు 42 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్ మాన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో https://cdn.s3waas.gov.in/s3f899139df5e1059396431415e770c6dd/uploads/2025/01/2025011774.pdf చూడొచ్చు. అలాగే దరఖాస్తు ఫారమ్‌ను ఈ వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3f899139df5e1059396431415e770c6dd/uploads/2025/01/2025011741.pdf ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి దాఖలు చేయాలని ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ ఫీజు ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.150, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. దివ్యాంగు అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజును District Medical & Health Officer, srikakulam పేరుతో డీడీ తీయాలి.
ఎంపిక ప్రక్రియ
స్టాఫ్ నర్సు పోస్టులను మార్కులు ఆధారంగానే భర్తీ చేస్తారు. విద్యా అర్హతలోని సబ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభవానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గరిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు.
అనుభవానికి సంబంధించి మార్కులను కూడా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.
3. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగాల భర్తీకి సీడాప్ ద్వారా మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్‌గా పని చేసేందుకు 30 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 20లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆహార ప్రాసెసింగ్, సహజ వనరుల అభివృద్ధి రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. 2024 నవంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 24న రాత పరీక్ష ఉంటుంది. జిల్లా డీఆర్‌డీఏ కార్యాలయంలో అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ ఫోటోలతో కలిపి దరఖాస్తు చేసుకోవాలి. అదనపు సమాచారం కోసం 798944612, 9912557054 నంబర్లను సంప్రదించాలని డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం