SBI Specialist Officers: ఎస్‌బిఐలో ఇంటర్వ్యూతోనే స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు, దరఖాస్తు చేయండి ఇలా..-specialist officer jobs in sbi with just an interview apply like this ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Sbi Specialist Officers: ఎస్‌బిఐలో ఇంటర్వ్యూతోనే స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు, దరఖాస్తు చేయండి ఇలా..

SBI Specialist Officers: ఎస్‌బిఐలో ఇంటర్వ్యూతోనే స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు, దరఖాస్తు చేయండి ఇలా..

SBI Specialist Officers: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్‌, కోల్‌కత్తా పోస్టింగులతో ట్రేడ్ ఫైనాన్స్‌ ఆఫీసర్‌- మిడిల్‌ మేనేజ్‌మెంట్ గ్రేడ్‌ 2 పోస్టులను భర్తీ చేస్తారు.

ఎస్‌బిఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

SBI Specialist Officers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌, కోల్‌కత్తాలలో పోస్టింగులతో 150స్పెషలిస్ట్‌ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటిలో ట్రేడ్ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ మిడిల్‌ మేనేజ్మెంట్‌ గ్రేడ్ స్కేల్ 2 ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులను నిర్దేశిత విద్యార్హతలతో పాటు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఖాళీల సంఖ్య

తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో ఎస్సీ క్యాటగిరీలో 24, ఎస్టీలో 11, ఓబీసీలో 38,ఈడబ్ల్యూఎస్‌లో 15, అన్‌ రిజర్వ్‌డ్‌ విభాగంలో 62 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుదారుల వయసు కనిష్టంగా 23 గరిష్టంగా 32 ఏళ్ల వయసులోపు ఉండాలి. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అయా పోస్టుకు తగిన విద్యార్హత కలిగి ఉండాలి. ప్రధానంగా గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఐఐబిఎఫ్‌ గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ ఇన్ ఫారెక్స్‌ ట్రేడ్‌ కలిగి ఉండాలి. సర్టిఫికెట్ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్‌, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.ఏదైనా కమర్షియల్ బ్యాంకులో కనీసం రెండేళ్ల పాటు పనిచేసి ఉండాలి. ట్రేడ్ ఫైనాన్స్‌ విభాగంలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన బ్యాంకుల జాబితా ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో ఉంటుంది.

ఎంపికైన వారు ట్రేడ్ ఫైనాన్స్‌ డాక్యుమెంట్ పరిశీలన చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ లెటర్స్ పరిశీలిన, వసూళ్లు, బ్యాంకుగ్యారంటీల పరిశీలన తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వేతన చెల్లింపు

ఎంపికైన వారిని మిడిల్ మేనేజ్మెంట్‌ గ్రేడ్ 2 విభాగంలో ఆర్నెల్లు ప్రొబేషన్ ఉంటుంది. రూ.64,820-93960 ప్రారంభ వేతనం లభిస్తుంది.ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం...

దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలు https://www.sbi.co.in/ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఎంపిక విధానం, ఇతర సమాచారం కోసం పూర్తి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు ఈ నోటిఫికేషన్ చూడండి…