ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు.. వారిపై స్పెషల్ ఫోకస్-special classes for telangana intermediate failed students ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు.. వారిపై స్పెషల్ ఫోకస్

ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు.. వారిపై స్పెషల్ ఫోకస్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సెంటేజీ తగ్గింది. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు.. స్పెషల్ క్లాసులు నిర్వహిస్తోంది. పలు జిల్లాల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి.

ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు (unsplash)

రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో.. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. జనరల్ కేటగిరీలో ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 68,100 మంది పరీక్షలు రాయగా కేవలం 28 వేల 937 మంది అంటే 42.49 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరంలో 74 వేల 161 మంది ఎగ్జామ్స్ రాస్తే.. 39 వేల 630 మంది అంటే.. 53.44 శాతం పాసయ్యారు. ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 57, సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 42 శాతం మంది ఫెయిల్ అయ్యారని లెక్కలు చెబుతున్నాయి.

ప్రభుత్వం సీరియస్..

ఉత్తీర్ణత శాతం ఇంత దారుణంగా ఉండటంపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రాయాలనుకునే వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతాధికారులు ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశమయ్యారు. స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులు పాస్ అయ్యేలా వారికి ప్రిపేర్ చేయాలని ఆదేశించారు.

స్పెషల్ క్లాసులు..

ఇప్పటికే పలు జిల్లాల్లో ఫెయిలైన విద్యార్థులకు, ఇంప్రూవ్ మెంట్ రాసే స్టూడెంట్లకు స్పెషల్ తరగతులు ప్రారంభం అయ్యాయి. అయితే.. అధ్యాపకులు మాత్రం ముఖ్యంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులపై ఫోకస్ పెట్టారు. వారిలోనూ ఒకే సబ్జెక్టు ఫెయిలైన వాళ్లు స్పెషల్ క్లాసులకు హాజరయ్యేలా చూస్తున్నారు. లెక్చరర్లు వారిని మే 22 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.

వారిపై ప్రత్యేక శ్రద్ధ..

తమ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులపై.. ఆయా సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కొన్ని కాలేజీల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్లాసులు నిర్వహిస్తే.. మరికొన్ని కళాశాలల్లో సాయంత్రం వరకు ఉంటున్నాయి. అధ్యాపకులు అందుబాటులో లేకపోతే జూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, వర్చువల్ విధానం ద్వారా స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో చాలా కాలేజీల్లో ఇంకా క్లాసులు ప్రారంభం కాలేదు.

ఉత్తీర్ణత శాతం వివరాలు..

మొదటి సంవత్సరం: 66.89 శాతం

రెండో సంవత్సరం: 71.37 శాతం

విద్యార్థుల సంఖ్య..

మొత్తం: 9,96,971 మంది

మొదటి సంవత్సరం: 4,88,448 మంది

రెండో సంవత్సరం: 5,08,523 మంది

బాలికలదే హవా..

బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉంది. మొదటి సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 73.83 శాతం కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 57.83 శాతం. ఇక రెండో సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 74.21 శాతం కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 57.31 శాతంగా ఉంది.

సంబంధిత కథనం