వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని జారీ చేసింది సౌత్ ఇడియన్ బ్యాంక్ (ఎస్ఐబీ). ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎస్ఐబీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ని దాఖలు (మే 19 నుంచి) చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు ఈ దఫా రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వయస్సు పరిమితి- అభ్యర్థి వయస్సు 28ఏళ్లకు మించకూడదు. రిక్రూట్మెంట్ రూల్స్ పరంగా అర్హులకు సవరణలు ఉంటాయి.
ఎలిజిబులిటీ- సౌత్ ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025 కోసం అప్లై చేయాలనుకుంటున్న వారు. భారత దేశంలో గుర్తింపు ఉన్న ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
అప్లికేషన్ ఫీజు- జనరల్ కేటగిరీ వారికి రూ. 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 200
వేతనం- ఎన్పీసీ కాంట్రిబ్యూషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం, పర్ఫార్మెన్స్ ఆధారిత వేరియబుల్ పేతో కలుపుకుని వార్షిక సీటీసీ రూ. 7.44 లక్షలు.
ఎంపిక విధానం- ఎస్ఐబీ రిక్రూట్మెంట్ 2025లో భాగంగా మొదట ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మంచి ప్రదర్శన చేసిన వారికి పోస్టుల ఖాళీల బట్టి ఉద్యోగం లభిస్తుంది.
అభ్యర్థులు నోటిఫికేషన్ని పూర్తి చదివిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్‌ని ప్రారంభించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎస్ఐబీ అధికారిక వెబ్‌సైట్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని అధికారులు వెల్లడించారు.
బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మరో అప్డేట్! ఐడీబీఐ రిక్రూట్మెంట్ 2025లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంకు అధికారిక వెబ్సైట్ (idbibank.in) లో అప్లికేషన్ని వేయొచ్చు. ఈ దఫా రిక్రూట్మెంట్లో మొత్తం 676 జేఏఎం పోస్టులను సంస్థ భర్తీ చేస్తోంది.
అప్లికేషన్ దాఖలుకు చివిరి తేదీ- 2025 మే 20 (మార్పులు- ఫీజు చెల్లింపుతో సహా)
ఆన్లైన్ పరీక్ష తేదీ- 2025 జూన్ 8.
ఐడీబీఐ రిక్రూట్మెంట్ 2025లో ఎంపికైన వారిని జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఓ) గా అపాయింట్ చేస్తారు. ఇనీషియల్ వార్షిక సీటీసీ రూ. 6.14లక్షలు- రూ. 6.50లక్షల (క్లాస్ ఏ నగరాలకు) మధ్యలో ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా సాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం