TG SSC Exams 2025 : పదో తరగతి పరీక్షల్లో రాణించటం ఎలా..? సిద్ధిపేట కలెక్టర్ చెబుతున్న ఈ 8 టిప్స్ తెలుసుకోండి
టెన్త్ పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. విద్యార్థులు పుస్తకాలతో పోటీ పడుతున్నారు. అయితే పదో తరగతి పరీక్షల్లో ఎలా రాణించాలనే దానిపై సిద్ధిపేట కలెక్టర్ మను చౌదరి కొన్ని టిప్స్ చెప్పారు. అవెంటో ఇక్కడ చూడండి…

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి కీలక సూచనలు చేశారు. పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి..? ఎలా రాణించాలనే విషయంపై టిప్స్ చెప్పారు. సివిల్స్ లో 36వ ర్యాంక్ సాధించిన మను చౌదరి…టీచర్ గా మారి పాఠాలు చెప్పటంతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విన్నారు.
షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని వసతి గృహాలకు సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్షలకు సంబంధించి ప్రతి అంశం పట్ల విషయ నిపుణులతో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ హాజరయ్యారు. పరీక్షలకు సంబంధించి మెలకువలపై తమదైన శైలిలో సూచనలు చేశారు.
1. కఠిన శ్రమ మరియు సమయపాలన:
విద్యార్థులు ప్రతిరోజూ కొన్ని గంటలు కచ్చితంగా చదువుకు కేటాయించాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే, నిద్ర మరియు విశ్రాంతిని కూడా సమతుల్యం చేయగలుగుతారు.
2. గమనికలు (నోట్స్) తయారు చేసుకోవాలి:
ప్రతి విషయం యొక్క ముఖ్యాంశాలను గమనిస్తూ, కుదించిన నోట్స్ తయారు చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఫార్ములాలు, తేదీలు, ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవడానికి ఇది సహాయపడుతుంది.
3. మౌఖిక మరియు ప్రాక్టీస్ టెస్టులు:
అభ్యాస పరీక్షలు రాస్తూ ఉంటే పరీక్షలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా, స్నేహితులతో కలిసి చర్చించడం, ప్రాక్టీస్ ప్రశ్నలు చేయడం ఉపయోగపడుతుంది.
4. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి:
తక్కువ మార్కులు వచ్చినా నిరాశ చెందకుండా, ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగాలి. "నేను సాధించగలను" అనే ఆత్మవిశ్వాసం ఉండాలి.
5. సోషల్ మీడియా మరియు ఆటలకు పరిమితి పెట్టుకోవాలి:
ఫోన్, టీవీ, వీడియో గేమ్స్ వంటి వాటిని పరీక్షల సమయంలో తగ్గించాలి. ఇవి సమయాన్ని వృథా చేస్తాయి.
6. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పే సూచనలు పాటించాలి:
ఉపాధ్యాయులను ప్రశ్నలు అడిగి మరింత నేర్చుకోవాలి. వారిని గౌరవిస్తూ వారు ఇచ్చే మార్గదర్శకత్వాన్ని పాటించాలి.
7. ఆరోగ్యం మరియు మానసిక స్థితి:
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి భోజనం, తగినంత నిద్ర, సాధ్యమైనంత వరకు ప్రాణాయామం లేదా యోగాతో ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది.
8. లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి:
ఎవరైనా తమ భవిష్యత్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఏ కోర్సులో చేరాలి అనేది ముందే నిర్ణయించుకుంటే… దాని కోసం కృషి చేయడం సులభం.
సంబంధిత కథనం