సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆఫీసర్ గ్రేడ్ 'ఏ' (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ని తాజాగా విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్ sebi.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంస్థలో మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివరాలతో కూడిన అధికారిక ప్రకటన, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ అక్టోబర్ 30, 2025న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే.. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఫీజు తదితర వివరాల కోసం కింద చదవండి.
మొత్తం 110 పోస్టులలో వివిధ విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
సెబీ రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయస్సు సెప్టెంబర్ 30, 2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. అంటే, అభ్యర్థి అక్టోబర్ 01, 1995 తర్వాత జన్మించి ఉండాలి. వర్తించే నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెబీ రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది:
ఫేజ్ I: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఇది ఆన్‌లైన్ పరీక్ష1
ఫేజ్ II: ఫేజ్ I లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఫేజ్ II పరీక్షకు హాజరవుతారు. ఇది కూడా రెండు పేపర్లు గల ఆన్‌లైన్ పరీక్ష రూపంలో ఉంటుంది.
ఇంటర్వ్యూ: ఫేజ్ II లో ఎంపికైన అభ్యర్థులను చివరిగా ఇంటర్వ్యూకి పిలుస్తారు.
సెబీ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తుకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము, సమాచార ఛార్జీలు కలిపి రూ. 1000/- + 18% జీఎస్‌టీ.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులకు సమాచార ఛార్జీలుగా రూ. 100/- + 18% జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపును ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే చేయాలి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం