Supreme Court Recruitment: సుప్రీంకోర్టులో లా క్లర్క్ పోస్ట్ ల భర్తీకి జనవరి 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం-sci recruitment registration for 90 law clerk posts begins on january 14 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Supreme Court Recruitment: సుప్రీంకోర్టులో లా క్లర్క్ పోస్ట్ ల భర్తీకి జనవరి 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

Supreme Court Recruitment: సుప్రీంకోర్టులో లా క్లర్క్ పోస్ట్ ల భర్తీకి జనవరి 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

Sudarshan V HT Telugu
Jan 11, 2025 03:15 PM IST

Supreme Court Recruitment: సుప్రీంకోర్టులో లా క్లర్క్ అండ్ ఆర్ఏ పోస్ట్ ల భర్తీకి త్వరలో రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ sci.gov.in ద్వారా ఆ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..

సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్
సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్

Supreme Court Recruitment: లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ sci.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సుప్రీంకోర్టులోని పలు విభాగాల్లో 90 పోస్టులను భర్తీ చేయనున్నారు.

yearly horoscope entry point

జనవరి 14 నుంచి..

సుప్రీంకోర్టులో లా క్లర్క్ అండ్ ఆర్ఏ పోస్ట్ ల కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 14న ప్రారంభమవుతుంది. 2025 ఫిబ్రవరి 7న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 14, 2025
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2025 ఫిబ్రవరి 7
  • రాత పరీక్ష: మార్చి 9, 2025

అర్హతలు

భారతదేశంలో చట్టం ద్వారా స్థాపించబడిన మరియు న్యాయవాదిగా నమోదు చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాల / కళాశాల / విశ్వవిద్యాలయం / సంస్థ నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (న్యాయశాస్త్రంలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుతో సహా) కలిగి ఉండాలి. అభ్యర్థికి పరిశోధన మరియు విశ్లేషణ నైపుణ్యాలు, రచనా సామర్థ్యాలు, కంప్యూటర్ల పరిజ్ఞానం ఉండాలి, ఇ-ఎస్సిఆర్, మనుపాత్ర, ఎస్సిసి ఆన్లైన్, లెక్సిస్నెక్సిస్, వెస్ట్లా వంటి వివిధ సెర్చ్ ఇంజిన్లు / ప్రక్రియల నుండి కావలసిన సమాచారాన్ని తిరిగి పొందే నైపుణ్యం ఉండాలి.

వయోపరిమితి

2025 ఫిబ్రవరి 2 నాటికి 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ (reservations) నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక విధానం

ఎంపిక విధానంలో మూడు దశలుంటాయి. అవి పార్ట్ 1- మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ప్రశ్నలు, చట్టాన్ని అర్థం చేసుకుని అన్వయించుకునే అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించడం, కాంప్రహెన్షన్ స్కిల్స్; పార్ట్-2: సబ్జెక్టివ్ రాతపరీక్ష, రైటింగ్, అనలిటికల్ స్కిల్స్; మూడవ భాగం- ఇంటర్వ్యూ. పార్ట్ 1 మరియు పార్ట్ 2 ఒకే రోజు భారతదేశంలోని ఇరవై మూడు (23) నగరాల్లో రెండు సెషన్లలో జరుగుతాయి.

దరఖాస్తు ఫీజు

సుప్రీంకోర్టు (supreme court) లో లా క్లర్క్ అండ్ ఆర్ఏ పోస్ట్ లకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లింపులు జరపాలి. పోస్టల్ దరఖాస్తును స్వీకరించరు. యూకో బ్యాంక్ అందించే పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి.

Whats_app_banner