Supreme Court recruitment 2025: సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్ట్ ల భర్తీ; విద్యార్హతలు, ఇతర వివరాలు
Supreme Court recruitment 2025: సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ https://www.sci.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Supreme Court recruitment 2025: సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హులైన అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ https://www.sci.gov.in/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సుప్రీంకోర్టులో 241 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మార్చి 8 లాస్ట్ డేట్
సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 ఫిబ్రవరి 5న ప్రారంభమై మార్చి 8న ముగుస్తుంది.
అర్హతలు
ఈ పోస్టుకు అప్లై చేయడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానంతో పాటు, కంప్యూటర్ పై నిమిషానికి కనీసం 35 ఇంగ్లీష్ పదాలు టైప్ చేయగలిగే సామర్ధ్యం ఉండాలి. అభ్యర్థుల వయసు 08.03.2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, టైపింగ్ టెస్ట్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 2 గంటలు, టైపింగ్ టెస్ట్ 10 నిమిషాలు, డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ 2 గంటలు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే కంప్యూటర్, డిస్క్రిప్టివ్ టెస్ట్ పై టైపింగ్ స్పీడ్ టెస్ట్ కు పిలుస్తారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ లో కూడా కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్మెన్/ దివ్యాంగులు/ స్వాతంత్య్ర సమరయోధులకు దరఖాస్తు ఫీజు రూ.250. ఈ ఫీజుతో పాటు బ్యాంకు ఛార్జీలు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. మరే రూపంలోనూ అప్లికేషన్ ఫీజును స్వీకరించరు. పోస్టల్ దరఖాస్తులను కూడా స్వీకరించరు. యూకో బ్యాంక్ అందించే పేమెంట్ గేట్ వే ద్వారా ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.