SBI SCO Recruitment 2025 : ఎస్బీఐ ఎస్‌సీఓ ఉద్యోగాలకు అప్లికేషన్ చివరి తేదీ నేడే.. ఇలా అప్లై చేయండి
SBI SCO Recruitment 2025 : ఎస్బీఐ ఎస్‌సీఓ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నేటితో ముగియనుంది. ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు విండోను జనవరి 23, 2025 గురువారం మూసివేస్తారు. రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశం ఉంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసేవారు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్(ఏదైనా విభాగం), ఐఐబీఎఫ్ ద్వారా ఫారెక్స్ సర్టిఫికేట్ పూర్తి చేసి ఉండాలి(సర్టిఫికేట్ తేదీ 31.12.2024 నాటికి ఉండాలి).
దరఖాస్తు ఫీజు
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు ఉండదు. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక విధానం
100 మార్కులకు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసేవారి మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మందికి కటాఫ్ మార్కుల కామన్‌గా ఉంటే.. అభ్యర్థులకు మెరిట్‌లో వారి వయస్సును బట్టి ర్యాంకులు ఇస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి
sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్ పేజీలో కెరియర్స్ లింక్ పై క్లిక్ చేయండి.
కరెంట్ ఓపెనింగ్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
కొత్త పేజీలో అభ్యర్థులు ఎస్బీఐ ఎస్‌సీఓ రిక్రూట్‌మెంట్ 2025 లింక్ మీద క్లిక్ చేయాలి.
రిజిస్టర్ చేసుకుని అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.
అప్లికేషన్ ఫామ్ నింపి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.
తర్వాత పేజీని డౌన్ లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ కాపీని తీసుకోండి.
టాపిక్