స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విద్యార్థుల కోసం రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్ ఇచ్చే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మెరిట్ ఉన్న విద్యార్థులు తమ చదువులకు ఆర్థిక భరోసా పొందవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు మార్కుల్లో 10 శాతం సడలింపు ఉంటుంది. అంతేకాకుండా, మహిళలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు చెరో 50% సీట్లు కేటాయించడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్బీఐ స్కాలర్‌షిప్ 2025కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ పథకాన్ని 'ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2025-26' పేరుతో ఎస్బీఐ ప్రారంభించింది. స్కూల్ విద్యార్థులు, అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, మెడికల్, ఐఐటీ, ఐఐఎం, విదేశాల్లో చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు, వారి చదువు స్థాయిని బట్టి రూ. 15,000 నుంచి రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.
ఆదాయం, చివరి తేదీ-
స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే స్కూల్ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు. ఇతర కోర్సుల విద్యార్థులకు ఈ ఆదాయ పరిమితి రూ. 6 లక్షలు. ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 15, 2025.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసేటప్పుడు ఈ కింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:
దరఖాస్తు విధానం
స్టెప్ 1- ఎస్బీఐ స్కాలర్‌షిప్ 2025 కోసం ముందుగా, బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbiashascholarship.co.inను సందర్శించాలి.
స్టెప్ 2- హోమ్‌పేజీలో ఉన్న 'అప్లై నౌ' బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3- మీ చదువు స్థాయిని ఎంచుకొని మరోసారి 'అప్లై నౌ' బటన్‌ను నొక్కాలి.
స్టెప్ 4- మొబైల్ నంబర్ లేదా జీమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి.
స్టెప్ 5- దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 6- నిబంధనలను అంగీకరించి, మీ అప్లికేషన్‌ను సరిచూసుకుని సబ్మిట్ చేయాలి.
మరిన్ని వివరాలకు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ చూడాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.
సంబంధిత కథనం