SBI RBO Recruitment 2025 : 1000కిపైగా పోస్టులు.. ఎస్బీఐ ఆర్​బీఓ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే ఛాన్స్​-sbi rbo recruitment 2025 registration for 1194 posts ends on march 15 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Sbi Rbo Recruitment 2025 : 1000కిపైగా పోస్టులు.. ఎస్బీఐ ఆర్​బీఓ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే ఛాన్స్​

SBI RBO Recruitment 2025 : 1000కిపైగా పోస్టులు.. ఎస్బీఐ ఆర్​బీఓ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే ఛాన్స్​

Sharath Chitturi HT Telugu
Published Mar 14, 2025 12:13 PM IST

SBI RBO Recruitment 2025 : ఎస్బీఐ ఆర్​బీఓ రిక్రూట్​మెంట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చ్​ 15న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టుల వివరాలు, అప్లికేషన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​బీఐ బ్రాంచీ..
ఎస్​బీఐ బ్రాంచీ.. (File)

ఎస్​బీఐ (స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ఆర్​బీఓ రిక్రూట్​మెంట్ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మార్చ్​ 15, అంటే శనివారంతో ముగియనుంది. కాన్కరెంట్​ ఆడిటర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు.

రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 1194 పోస్టులను భర్తీ చేయనుంది ఎస్బీఐ.

60ఏళ్ల వయస్సులో సూపర్​యాన్యుయేషన్​ పొందిన అధికారి బ్యాంక్​ సేవల నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. సూపర్​యాన్యుయేషన్​కి ముందు స్వచ్ఛంద పదవీ విరమణ/ రాజీనామా/ సస్పెన్షన్​/ బ్యాంక్​ విడిచి వెళ్లిపోయిన వారికి అర్హత లేదు. ఎస్​బీఐ అధికారులు, ఎస్​బీఐ ఈ- అసోసియేట్​ బ్యాంక్స్​లో సూపర్​యాన్యుయేషన్​ పొందిన అనంతరం ఎంఎంజీఎస్​-3, ఎస్​ఎంజీఎస్​-4,5, టీఈజీఎస్​-4 గా రిటైర్​ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.​

ఎస్బీఐ ఆర్​బీఓ రిక్రూట్మెంట్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇలా అప్లై చేసుకోండి..

అభ్యర్థులు ఈ స్టెప్స్​ని అనుసరించవచ్చు.

1. sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఎస్బీఐ కెరీర్స్ లింక్​పై క్లిక్ చేయండి.

3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు ఎస్బీఐ ఆర్​బీఓ రిక్రూట్​మెంట్​ లింక్​పై క్లిక్ చేయాలి.

4. అప్లై ఆన్​లైన్ లింక్​పై క్లిక్ చేయడానికి డ్రాప్​డౌన్​ బాక్స్ ఓపెన్ అవుతుంది.

5. రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ నింపాలి.

6. పేమెంట్ చేసి సబ్మిట్​పై క్లిక్ చేయాలి.

7. తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్ చేసుకోవాలి.

8. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

ఈ ఎంగేజ్మెంట్ కనీసం 1 సంవత్సరం- గరిష్టంగా 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు, సంతృప్తికరమైన పనితీరుకు లోబడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థుల షార్ట్​లిస్టింగ్​, ఇంటర్వ్యూ ఉంటాయి. బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేసిన షార్ట్ లిస్టింగ్ కమిటీయయ షార్ట్ లిస్టింగ్ పారామీటర్లను నిర్ణయిస్తుంది. ఆ తరువాత, బ్యాంక్ నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను పిక్​ చేసి. ఇంటర్వ్యూకు పిలుస్తుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థికి లోబడి ఇంటర్వ్యూలో సాధించిన స్కోర్ల క్రమంలో తుది ఎంపికకు మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కామన్ కటాఫ్ మార్కులు సాధిస్తే వారి వయస్సును బట్టి మెరిట్ ప్రకారం ర్యాంకులు ఇస్తారు.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం