SBI Recruitment 2025: ఎస్బీఐలో కాంకరెంట్ ఆడిటర్ రిక్రూట్మెంట్; 1194 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్-sbi concurrent auditor recruitment 2025 apply for 1194 posts direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Sbi Recruitment 2025: ఎస్బీఐలో కాంకరెంట్ ఆడిటర్ రిక్రూట్మెంట్; 1194 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

SBI Recruitment 2025: ఎస్బీఐలో కాంకరెంట్ ఆడిటర్ రిక్రూట్మెంట్; 1194 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

Sudarshan V HT Telugu

ఎస్బీఐ కాంకరెంట్ ఆడిటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1194 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

ఎస్బీఐ కాంకరెంట్ ఆడిటర్ రిక్రూట్మెంట్ (REUTERS)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కాంకరెట్ ఆడిటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎస్బీఐ రిటైర్డ్ ఆఫీసర్లు, అసోసియేట్స్ (ఈ-ఏబీ) sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1194 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 18న ప్రారంభమై 2025 మార్చి 15న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

ఖాళీల వివరాలు

1. అహ్మదాబాద్: 124 పోస్టులు

2. అమరావతి: 77 పోస్టులు

3. బెంగళూరు: 49 పోస్టులు

4. భోపాల్: 70 పోస్టులు

5. భువనేశ్వర్: 50 పోస్టులు

6. చండీగఢ్: 96 పోస్టులు

7. చెన్నై: 88 పోస్టులు

8. గౌహతి: 66 పోస్టులు

9. హైదరాబాద్: 79 పోస్టులు

10. జైపూర్: 56 పోస్టులు

11. కోల్కతా: 63 పోస్టులు

12. లక్నో: 99 పోస్టులు

13. మహారాష్ట్ర: 91 పోస్టులు

14. ముంబై మెట్రో: 16 పోస్టులు

15. న్యూఢిల్లీ: 68 పోస్టులు

16. పాట్నా: 50 పోస్టులు

17. తిరువనంతపురం: 52 పోస్టులు

అర్హత ప్రమాణాలు

ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకు అధికారి 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ పొందిన తరువాత మాత్రమే బ్యాంక్ సర్వీస్ నుండి రిటైర్ అయి ఉండాలి. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన/ రాజీనామా చేసిన/ సస్పెండ్ చేసిన లేదా పదవీ విరమణకు ముందే బ్యాంకును విడిచిపెట్టిన అధికారులు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. పదవీ విరమణ చేసిన ఎంఎంజీఎస్-3, ఎస్ఎంజీఎస్-4/వీ, టీఈజీఎస్-6గా పదవీ విరమణ చేసిన ఎస్బీఐ, దాని ఈ-అసోసియేట్ బ్యాంకుల అధికారులను పరిగణనలోకి తీసుకుంటారు.

ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియలో, మొదట దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేయబడిన షార్ట్ లిస్టింగ్ కమిటీ షార్ట్ లిస్టింగ్ పారామీటర్లను నిర్ణయిస్తుంది. ఆ తరువాత, బ్యాంక్ నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూలో సాధించిన స్కోర్ల క్రమంలో తుది ఎంపికకు మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కామన్ కటాఫ్ మార్కులు సాధిస్తే వారి వయసును బట్టి మెరిట్ ప్రకారం ర్యాంకులు ఇస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం