SBI Clerk Prelims Result 2025: ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. జూనియర్ అసోసియేట్ పోస్ట్ ల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు, రిజల్ట్స్ వెలువడిన తరువాత ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. రిజల్ట్ లింక్ sbi.co.in/web/careers/Current-openings లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో "ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 మెయిన్ పరీక్ష తాత్కాలిక తేదీని 10.04.2025 గా వెల్లడించారు. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయని, ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష కోసం కాల్ లెటర్లు జారీ చేస్తామని ఎస్బీఐ తెలిపింది.
ఎస్బీఐ క్లర్క్ 2025 ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1వ తేదీల్లో జరిగింది. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు గంటపాటు జరిగింది. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనే మూడు విభాగాలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది, ప్రతి తప్పు సమాధానానికి, ఒక ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగింట ఒక వంతు కోత విధిస్తారు.
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలను అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా చూసుకోవచ్చు.
2. కెరీర్స్ లింక్ పై క్లిక్ చేసి కరెంట్ ఓపెనింగ్స్ లోకి వెళ్లాలి.
3. పేజీలో అందుబాటులో ఉన్న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ 2025 లింక్ పై క్లిక్ చేయండి.
4. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
5.లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది.
6. రిజల్ట్ చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
7. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. మెయిన్ పరీక్షలో 190 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటల 40 నిమిషాలు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/4వ వంతు కోత విధిస్తారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్బీఐ 13,735 జూనియర్ అసోసియేట్ ఖాళీలను భర్తీ చేయనుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.
సంబంధిత కథనం