SBI Clerk Admit Card : ఎస్బీఐ క్లర్ట్ అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్- రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
SBI Clerk Admit Card : ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డు విడుదల తేదీకి సంబంధించిన కీలక విషయం బయటకు వచ్చింది. అంతేకాదు, పరీక్షకి సంబంధించిన టెంటెటివ్ తేదీలను కూడా ఎస్బీఐ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు రెడీ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్! క్లర్క్ అడ్మిట్ కార్డుల విడుదల తేదీపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు జూనియర్ అసోసియేట్ పోస్టులకు తాత్కాలిక పరీక్ష తేదీలను సైతం ప్రకటించింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డు తేదీ, పరీక్ష తేదీలను ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో చూసుకోవచ్చు.

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు..
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు/ కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకునేందుకు కావాల్సిన లింక్‌ని ఫిబ్రవరి 10, 2025 నాటికి విడుదల చేస్తారు. జూనియర్ అసోసియేట్ తాత్కాలిక పరీక్ష తేదీలు.. ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1, 2025.
అధికారిక వెబ్సైట్ ప్రకారం.. “ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు తాత్కాలిక తేదీలు 22, 27, 28 ఫిబ్రవరి, మార్చి 1. ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ కోసం లింక్‌ని బ్యాంక్ వెభ్‌సైట్‌లో 2025 ఫిబ్రవరి 10 నాటికి ప్రచురిస్తారు. ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులు సన్నద్ధంగా ఉండాలి.”
క్లర్క్ అడ్మిట్ కార్డు - ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
1. sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కెరీర్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ అభ్యర్థులు కరెంట్ ఓపెనింగ్స్ లింక్‌పై క్లిక్ చేయాలి.
4. ఇప్పుడు పేజీలో అందుబాటులో ఉన్న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
5. లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
6. అనంతరం మీ అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది.
7. అడ్మిట్ కార్డును చెక్ చేసుకుని సంబంధిత పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
8. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుకోండి.
ఎస్బీఐ క్లర్క్ పరీక్ష వివరాలు..
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కుల ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనే మూడు సెక్షన్లతో ఈ పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌తో సంస్థలోని 13735 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది ఎస్బీఐ. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 17న ప్రారంభమై 2025 జనవరి 7న ముగిసింది.
ఎస్బీఐ క్లర్క్ ప్రీ ట్రైనింగ్ అడ్మిట్ కార్డును గత వారం అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
సంబంధిత కథనం