మీరు బ్యాంకులో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసం గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీఐ) రిక్రూట్‌మెంట్ 2025 కింద 2600 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియను మరోసారి ప్రారంభించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఇప్పుడు జూన్ 30, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ సీబీఓ రిక్రూట్‌మెంట్ 2025 ఆన్‌లైన్ పోర్టల్‌లో తిరిగి తెరిచారు. దీనికి చివరి తేదీ జూన్ 30, 2025. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 2,964 ఖాళీలు అంటే 2,600 రెగ్యులర్, 364 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in/web/careers ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30 అని గుర్తుంచుకోండి. చివరి క్షణం వరకు వేచి ఉండకండి. అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని సకాలంలో దరఖాస్తు చేసుకోండి.
ఈ నియామక ప్రచారం ద్వారా మొత్తం 2600 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1066 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి, 387 ఎస్సీలకు, 190 ఎస్టీలకు, 697 ఓబీసీలకు, 260 ఈడబ్ల్యుఎస్ కేటగిరీకి రిజర్వ్ చేయబడ్డాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాల నియామకాలలో కూడా ప్రత్యేక అవకాశాలు ఇచ్చారు.
ఈసారి ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, స్థానిక భాషకు బదులుగా ఆంగ్ల భాషను కూడా ఎంపికగా అంగీకరించారు. అర్హతల గురించి చూస్తే.. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే బ్యాంకింగ్ రంగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమితి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపు ఇస్తారు.
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. పరీక్షలో స్థానిక భాష పరిజ్ఞానం కూడా తప్పనిసరి, ఎందుకంటే అభ్యర్థి తనకు తెలిసిన భాష ఉన్న సర్కిల్‌లో నియమిస్తారు. దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 750 రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, PWD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు పూర్తిగా ఉచితం.