రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీ) 2025 సంవత్సరానికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, వివిధ కేటగిరీల టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ఇటీవలే ప్రారంభించాయి. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 6238 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్ఆర్బీల వారీగా ఖాళీల వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025 అప్లికేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టు పేరు | పే లెవల్ | ప్రారంభ వేతనం | మొత్తం వేకెన్సీలు |
---|---|---|---|
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ | లెవల్ 5 | రూ. 29,200 | 183 |
టెక్నీషియన్ గ్రేడ్ 3 | లెవల్ 2 | రూ. 19,900 | 6055 |
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025కి అప్లై చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులు మినహా మిగిలిన వారికి దరఖాస్తు రుసుము రూ. 500. వీరు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కి హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి రూ. 400 తిరిగి ఇస్తారు.
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250. వీరు సీబీటీకి హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి ఈ రుసుము పూర్తిగా తిరిగి ఇవ్వడం జరుగుతుంది.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. రెండు పోస్టులకు (టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-III) సీబీటీ విడివిడిగా నిర్వహిస్తారు.
అన్‌రిజర్వ్‌డ్: 40 శాతం
ఈడబ్ల్యూఎస్: 40 శాతం
ఓబీసీ-ఎన్‌సీఎల్: 30 శాతం
ఎస్సీ: 30 శాతం
ఎస్టీ: 25 శాతం
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆయా ఆర్ఆర్బీల అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం