RRB RPF SI admit card 2024 : ఆర్పీఎఫ్ ఎస్ఐ అడ్మిట్ కార్డు 2024.. ఈ స్టెప్స్ చూసి డౌన్‌లోడ్ చేసుకోండి!
RRB RPF SI admit card 2024 : ఆర్ఆర్‌బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ అడ్మిట్ కార్డు 2024 అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 12న పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలానో ఇక్కడ తెలుసుకోండి.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్లో సబ్ ఇన్స్పెక్టర్(ఎగ్జిక్యూటివ్) అడ్మిట్ కార్డులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) డిసెంబర్ 8న ఆదివారం విడుదల చేసింది. డిసెంబర్ 12న పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆర్పీఎఫ్ ఎస్ఐ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షకు నాలుగు రోజుల ముందు ఆర్పీఎఫ్ హాల్ టికెట్లను దశలవారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ 2, 3, 9 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేశారు. తదుపరి పరీక్షలు 2024 డిసెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్నాయి.
అభ్యర్థులు హాల్‌టికెట్లపై పేర్కొన్న సూచనలను జాగ్రత్తగా చదవాలి. వాటిని కచ్చితంగా పాటించాలి. నిబంధనల ప్రకారం అభ్యర్థులు రిపోర్టింగ్ సమయం ప్రకారం పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. గేట్ క్లోజింగ్ సమయానికి ముందే పరీక్ష హాల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా అడ్మిట్ కార్డుల్లో పేర్కొన్న వస్తువులను మాత్రమే తీసుకురావాలని, ఏదైనా నిషేధిత వస్తువును తీసుకెళ్లడం అనర్హతకు దారితీస్తుందని రిక్రూట్‌మెంట్ పేర్కొంది. పరీక్ష రోజున అభ్యర్థులు అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, పేర్కొన్న ఇతర డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాలి. పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోవాలి.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో 452 సబ్ ఇన్స్పెక్టర్(ఎగ్జిక్యూటివ్), 4,208 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
ఇలా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేయాలి?
సంబంధిత ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్ పేజీలో ఆర్ఆర్‌బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ అడ్మిట్ కార్డు 2024 లింక్ మీద క్లిక్ చేయండి.
కొత్త పేజీలో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఆర్ఆర్‌బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ అడ్మిట్ కార్డు డిస్‌ప్లే అవుతుంది.
అడ్మిట్ కార్డులోని వివరాలను సరిచూసుకోవాలి.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్‌ను తీసుకోవాలి. తదుపరి దీనితో అవసరం పడుతుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.