RPF Constable Answer Key : ఆర్​ఆఈర్బీ ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ ఆన్సర్​ కీలో తప్పులు కనిపిస్తే ఏం చేయాలి?-rrb rpf constable answer key 2025 released direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Rpf Constable Answer Key : ఆర్​ఆఈర్బీ ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ ఆన్సర్​ కీలో తప్పులు కనిపిస్తే ఏం చేయాలి?

RPF Constable Answer Key : ఆర్​ఆఈర్బీ ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ ఆన్సర్​ కీలో తప్పులు కనిపిస్తే ఏం చేయాలి?

Sharath Chitturi HT Telugu

RRB RPF answer key : ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్ కీ 2025 విడుదలైంది. ఇందులో ఏవైనా తప్పులు కనిపిస్తే, సవాలు చేయవచ్చు. ఇందుకు చివరి తేదీ, రుసుముతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్ కీ

రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు (ఆర్​ఆర్బీ) ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్​మెంట్ ఎగ్జామినేషన్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ప్రాంతీయ ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్ల నుంచి ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

ఆన్సర్ కీతో పాటు, ఆర్ఆర్బీలు ప్రశ్నపత్రాలను, అభ్యర్థుల రెస్పాన్స్​ షీట్స్​ని కూడా విడుదల చేశాయి.

దీంతోపాటు ఆన్సర్ కీని సవాలు చేసే విండోను కూడా తెరిచారు. అభ్యంతరాలు తెలియజేయాలనుకునే అభ్యర్థులు 2025 మార్చ్​ 29, ఉదయం 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గడువు తర్వాత ప్రశ్నలు, ఆప్షన్లు, కీ లు తదితర అంశాలపై ఆర్ఆర్బీలు ఎలాంటి ప్రాతినిధ్యాన్ని అంగీకరించవు.

ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఆన్సర్ కీ 2025 డౌన్​లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆన్సర్ కీని సవాలు చేయడానికి అభ్యర్థులు రూ .50తో పాటు వర్తించే బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు సరైనవని తేలితే బ్యాంకు ఛార్జీలు మినహాయించిన తర్వాత ఫీజును తిరిగి చెల్లిస్తారు.

సీఈఎన్ ఆర్పీఎఫ్ 02/2024 కింద కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో 2025 మార్చ్​ 2 నుంచి 18 వరకు పరీక్ష నిర్వహించారు.

అభ్యర్థులు 120 ప్రశ్నలను 90 నిమిషాల్లో రాయాల్సి ఉంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కులు వచ్చాయి. ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు ఇవ్వరు లేదా తీసివేయరు.

సీబీటీలో అర్హత సాధించిన అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ) రౌండ్లకు పిలుస్తారు.

రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా ఆర్ఆర్బీలు 4208 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్ కీ 2025 డౌన్​లోడ్​:

ఆన్సర్ కీని డౌన్​లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్​ అనుసరించవచ్చు:

  1. మీరు దరఖాస్తు చేసుకున్న ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  2. హోమ్ పేజీలో, సీఈఎన్ ఆర్పీఎఫ్ 02/2024 కింద ప్రదర్శించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆన్సర్ కీని డౌన్​లోడ్ చేయడానికి లింక్​పై క్లిక్ చేయండి.
  3. తర్వాతి పేజీలో మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  4. మీ ఆన్సర్ కీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
  5. ఆన్సర్ కీని డౌన్​లోడ్ చేసుకుని, భవిష్యత్ రిఫరెన్స్ కోసం ప్రింటౌట్​తీసి పెట్టుకోండి.

మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం