రైల్వేలో భారీగా ఖాళీలు- ప్రారంభ వేతనం రూ. 40వేలకుపైనే! రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..
ఆర్ఆర్బీ తాజాగా 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తుకు గడువు ఫిబ్రవరి 6, 2024 అని గుర్తుపెట్టుకోవాలి. అభ్యర్థులు rrbapply.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. వేతనం, వయస్సు పరిమితితో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారు గుడ్ న్యూస్! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ ఖాళీల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఆర్ఆర్బీ. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీస్ (సీఈఎన్) 07/2024 కింద rrbapply.gov.in ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్ఆర్బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ పోస్టుల భర్తీ- అప్లై చేసుకునేందుకు డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6.
ఖాళీల వివరాలు..
పోస్టు పేరు | పే లెవల్ (7వ సీపీసీ ప్రకారం) | ప్రారంభ వేతనం | వయస్సు పరిమితి (January 1, 2025 నాటికి) | ఖాళీల వివరాలు |
---|---|---|---|---|
Post Graduate Teachers of different subjects | 8 | ₹47600 | 18 - 48 | 187 |
Scientific Supervisor (Ergonomics and Training) | 7 | ₹44900 | 18 - 38 | 3 |
Trained Graduate Teachers of different subjects | 7 | Rs44900 | 18 – 48 | 338 |
Chief Law Assistant | 7 | ₹44900 | 18 – 43 | 54 |
Public Prosecutor | 7 | ₹44900 | 18 – 35 | 20 |
Physical Training Instructor (English Medium) | 7 | ₹44900 | 18 - 48 | 18 |
Scientific Assistant/Training | 6 | ₹35400 | 18 – 38 | 2 |
Junior Translator/Hindi | 6 | ₹35400 | 18 – 36 | 130 |
Senior Publicity Inspector | 6 | ₹35400 | 18 – 36 | 3 |
Staff and Welfare Inspector | 6 | ₹35400 | 18 – 36 | 59 |
Librarian | 6 | ₹35400 | 18 – 33 | 10 |
Music Teacher (Female) | 6 | ₹35400 | 18 - 48 | 3 |
Primary Railway Teacher of different subjects | 6 | ₹35400 | 18 - 48 | 188 |
Assistant Teacher (Female) (Junior School) | 6 | ₹35400 | 18 - 48 | 2 |
Laboratory Assistant/School | 4 | ₹25500 | 18 - 48 | 7 |
Lab Assistant Grade III(Chemist and Metallurgist) | 2 | ₹19900 | 18 – 33 | 12 |
ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ కోసం పైన ఇచ్చిన పట్టికలో సూచించిన వయస్సు పరిధి సంవత్సరాల్లో ఉంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఒకసారి సడలింపు కారణంగా వయస్సు పరిమితికి మించి 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మరింత సడలింపు వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ/ ఎస్టీ/ మైనారిటీ వర్గాలు/ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250. మొదటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ 1)కు హాజరయ్యే అభ్యర్థులకు బ్యాంకు ఛార్జీల తగ్గింపు తర్వాత ఈ ఫీజు రీఫండ్ లభిస్తుంది.
మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500. ఇందులో సీబీటీ-1 రాసే అభ్యర్థులకు మాత్రమే బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 రీఫండ్ చేస్తారు.
పోస్టుల వారీగా అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం కింది నోటిఫికేషన్ని చూడాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్లో తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం