RRB recruitment 2025 : 10 పాసైన వారి కోసం రైల్వేలో భారీగా ఉద్యోగాలు- రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..
RRB recruitment 2025 : 10వ తరగతి పాసైన వారికి ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. 32వేలకుపైగా పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అలర్ట్! 32,438 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు rrbapply.gov.in లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌కి చివరి గడువు ఫిబ్రవరి 22 అని గుర్తుపెట్టుకోవాలి.
ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025- ముఖ్యమైన తేదీలు..
1. దరఖాస్తు ప్రారంభ తేది: జనవరి 23, 2025
2. దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 22, 2025
3. దరఖాస్తు విండో ముగిశాక దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేది: ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 24, 2025
4. కరెక్షన్ విండో: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6, 2025
ఈ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ని కింది పోస్టుల కోసం నిర్వహిస్తున్నారు..
పోస్టు పేరు | విభాగం | సబ్ డిపార్ట్మెంట్ |
---|---|---|
ASSISTANT TL and AC (WORKSHOP) | ELECTRICAL | GENERAL SERVICES |
ASSISTANT TL AND AC | ELECTRICAL | GENERAL SERVICES, PRODUCTION UNIT |
ASSISTANT TRACK MACHINE | ENGINEERING | TRACK MACHINE |
ASSISTANT TRD | ELECTRICAL | TRD |
POINTSMAN B | TRAFFIC | TRAFFIC |
TRACKMAINTAINER-IV | ENGINEERING | P WAY |
సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (సీఈఎన్ 08/2024) కింద ప్రకటించిన 32,438 ఖాళీలు.. 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్‌లోని లెవల్ 1లో ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్లో రైల్వే జోన్, పోస్టుల వారీగా ఖాళీల వివరాలను తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అర్హత ప్రమాణాలు..
అన్ని పోస్టులకు జనరల్ ఎలిజిబిలిటీ ప్రమాణాలు ఒకేలా ఉంటాయి. పదో తరగతి లేదా ఐటీఐ లేదా తత్సమాన ఉత్తీర్ణత, లేదా ఎన్సీవీటీ మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జనవరి 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం
ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025 ఎంపిక ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు
- వైద్య పరీక్షలు..
సీబీటీలో 100 ప్రశ్నలకు 1/3వ వంతు తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు అవసరం.
దరఖాస్తు ఫీజు :
ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025 కోసం అప్లై చేస్తున్న దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.250.
సీబీటీకి హాజరైన తర్వాత బ్యాంకు ఛార్జీలు మినహాయించుకున్న తర్వాత అప్లికేషన్ ఫీజును తిరిగి చెల్లిస్తారు.
మిగతా అభ్యర్థుల దరఖాస్తు ఫీజు రూ.500. కాగా, సీబీటీకి హాజరైన తర్వాత రూ.400 రీఫండ్ చేస్తారు.
ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025- ఇలా అప్లై చేసుకోండి..
- ఆర్ఆర్బీల అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో, సీఈఎన్ నంబర్ 08/2024 కింద ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ అవ్వడానికి, సబ్మిట్ చేయడానికి మీ వివరాలను నమోదు చేయండి.
- అప్లికేషన్ ఫామ్ నింపి, అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- కన్ఫర్మేషన్ పేజీని సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం దానిని ప్రింటౌట్ తీసుకోండి.
సంబంధిత కథనం