ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ రిక్రూట్‌మెంట్ 2025 కింద 1036 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఇప్పుడు అభ్యర్థులు 16 ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఈ తేదీని ఫిబ్రవరి 6, 2025గా నిర్ణయించారు. అభ్యర్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా వివిధ రకాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, PRT (ప్రాథమిక ఉపాధ్యాయుడు), సంగీత ఉపాధ్యాయుడు, మహిళా జూనియర్ స్కూల్ టీచర్, మహిళా అసిస్టెంట్ టీచర్ (ప్రాథమిక పాఠశాల), ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రేరియన్, జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ)తోపాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్ ప్రకారం, సంబంధిత పోస్టును అనుసరించి విద్యార్హతలు ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డిప్లోమా, ఎంబీఏ, టెట్, బీఎడ్, బీఈ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని స్థానాలకు ప్రత్యేక డిప్లొమా లేదా డిగ్రీ అవసరం కావచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. పోస్టులను బట్టి గరిష్ఠ వయసు ఉంటుంది. ఎంపిక విధానంలో భాగంగా రాత పరీక్ష, శారీరక పరీక్ష, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఉంటాయి.
CBT పరీక్ష 90 నిమిషాలు ఉంటుంది. ఇందులో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వృత్తిపరమైన సామర్థ్యం, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు ఫీజు.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.
ముందుగా అభ్యర్థులు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌ని సందర్శించండి .
ఆ తర్వాత RRB Ministerial & Isolated Categories Recruitment 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
అభ్యర్థులు వారి విద్యార్హత, వయస్సు ప్రకారం పోస్ట్‌ను ఎంచుకోవాలి.
రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయాలి.
ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.
దీని తరువాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరగా దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోవాలి.